Jordar News: బంగారం తిరిగి ఇచ్చేశారు
Jordar News: మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ గోల్డ్ లోన్ బాధితులకు న్యాయం జరిగింది. నెలల తరబడి వేచి చూసిన బాధితుల చేతికి బంగారం అందింది.
Jordar News: బంగారం తిరిగి ఇచ్చేశారు
Jordar News: ఇగో.. ఈడ కానొచ్చేదంత మేలిమి బంగారమేనుల్లా. అది గూడ ఉత్తుత్తది గాదుల్లో.. దొంగ శేత్లకు జిక్కి సురక్షితంగ బైటవడ్డ బాధితుల కష్టార్జితముల్లా. మంచిర్యాల జిల్లా చెన్నూరు కాడ నిన్నమొన్నటి దాంక కుదవెట్టిన బంగారాన్ని ఎవలిదాల్లకు ఇత్తలేరని జంగు జేశిర్రు గదా కొందరు గోల్డు లోన్ బాధితులు. ఆకరికి ఇయ్యాల వాళ్లయి వాళ్లకు ఇచ్చెతందుకు.. ముంగటవడ్డరు అధికార్లు. ఇయ్యాల లోన్లున్నోల్లను పిలిపిచ్చుకొని, బాకీలుంటె కట్టిపిచ్చుకొని.. ఎవ్వల సొమ్ములను వాల్లకు అప్పజెప్పిర్రిట్ల. ఇగ అస్తదో రాదో అనుకున్న కష్టార్జితం.. ఇయ్యాల వాళ్ల కండ్ల ముంగట కానొచ్చెటాలకు మస్తు ముర్శిపోయిర్రు.
వీళ్ల సమస్యను ఇటు ఉన్నతాధికార్లకు, అటు దున్యా జనాలకు తెల్శెతట్టు జేశ్న హెచ్ఎంటీవీ విలేకరన్నలను తారీఫ్ జేశిర్రు బాధితులంత. శెనార్తులు జెప్పుకుంట బంగారాన్ని సూశి మస్తు ముర్శిపోయిర్రు. అప్పుడు కండ్ల నీళ్లు తీశ్నోల్ల సంబురమైతే శిన్నగ లేదుపోర్రి. అందరికి ఒక్కటే పారి గాకుంట విడుతల వారీగ ఇస్తున్నరట. కడ్మోల్లూ.. తయారుండుర్రి, తీస్కునెతందుకు. బ్యాంకోల్లు సుతం ఎవ్వలకు లోటు లేకుంట ఎంబటెంబటే ఇస్తమంటున్నరు కనీ.. మొత్తానికైతే., పదినెల్లకు తిప్పలు తీరినయ్, బంగారం శేతికచ్చింది.
ఈ బ్యాంకులైన దొంగతనాన్ని ఎన్కుండి నడ్పిన క్యాషియర్ను, మేనేజర్ను, ఇంక కొందరిని, దొంగతనం జేశ్నోల్లను మొత్తం 43 మందిని లోపటేశిర్రు. కనీ.. బ్యాంకులకే సేఫ్టీలేదంటే.. ఇంక ఏడదాసుడు, ఏడ కుదవెట్టుడు చెప్పుర్రి. బ్యాలన్సు లేదని, సర్వీస్ ఎక్విత్తున్నమని, లాకర్ ఉందని అడ్డగోలు ఫైన్లు గుంజే బ్యాంకోల్లు.. ఇంటిదొంగల నుంచి తప్పిచ్చే ఉపాయం జేస్తే మంచిది. ఇట్ల ఎన్నడన్న ఇంటి దొంగలు వడ్తె, పోయ్న బంగారానికి ఇన్సూరెన్స్ అసొంటిది ఉపాయం జేత్తె మంచిదని అనుకోవట్టిర్రు బ్యాంకోల్ల పనితనం సూశ్న జనాలు.




