News Analysis: హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.. ప్రజల దృష్టి ఇప్పుడు బీజేపీ వైపే: వెంకట్ రెడ్డి
News Analysis: డబ్బుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కక్కుర్తి పడుతోందని, ఇవి బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలని బీజేపీ నేత వెంకట్ రెడ్డి మండిపడ్డారు.
News Analysis: హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.. ప్రజల దృష్టి ఇప్పుడు బీజేపీ వైపే: వెంకట్ రెడ్డి
News Analysis: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న తరుణంలో ఆ పార్టీ ప్రకటనలపై బీజేపీ సీనియర్ నేత వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల సమయంలో అమలు సాధ్యం కాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని అమలు చేయలేక కుంటిసాకులు చెబుతోందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ కూడా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
రాష్ట్రంలో విపరీతమైన అప్పులు చేస్తూ, ఆదాయం కోసం ప్రభుత్వం నానా కష్టాలు పడుతోందని వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. హౌసింగ్ బోర్డు కాలనీల్లో ఇళ్ల పక్కన ఉన్న చిన్నపాటి ఖాళీ స్థలాలను (20-30 గజాలు) కూడా సామాన్యులకు కేటాయించకుండా వాటికి బహిరంగ వేలం (ఆక్షన్) పెట్టాలని చూడటం దారుణమన్నారు. డబ్బుల కోసం ప్రభుత్వం ఇంతలా కక్కుర్తి పడటం బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు నిదర్శనమని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనను చూసిన ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని స్పష్టం చేశారు.




