Jordar News: ప్రైవేటు బడులు వద్దు.. సర్కారు బడులు ముద్దు
Jordar News: ప్రైవేట్ బడుల హడావిడి మధ్య ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు డప్పు కొడుతూ, ఊరూరా తిరుగుతూ ప్రభుత్వ బడి గొప్పతనాన్ని వివరిస్తున్నారు.
Jordar News: ప్రైవేటు బడులు వద్దు.. సర్కారు బడులు ముద్దు
Jordar News: వారెవా.. సర్కారు బడి సారేమో సంకల డప్పేస్కోని సప్పుడు జేస్తున్నుడు.. పొల్లగాండ్లేమో డప్పు సప్పుడు తగ్గట్టు డ్యాన్సు జేస్తున్నరు. శుక్రారం సంది బడులు చాలాయితున్నయుల్లో.. అందుకే ఈ సంబురమంత. పొల్లగాండ్లను సర్కారు బడికే సాగదోలాల్నని డప్పు కొట్టుకుంట ఊరంత తిర్గిండిట్ల. గీ సారు పేరు వి. గోపీనాథ్. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాటిమీది గూడెం సర్కారు బడిల సారీయినె. ప్రవేటు బడులు అడ్మిషన్ల కోసం అచ్చేశిన కాయిదాలు పట్టుకోని తిర్గుతుంటె, ఈ సారేమో తన స్టైళ్ల డప్పు సంకకేశి, శిప్ప సప్ప వాయించుకుంట ప్రవేటు బడుల తప్పు అదులగొట్టిండు. ప్రైవేటు బడులు అద్దు.. ప్రభుత్వ బడులే ముద్దు అనుకుంట ప్రభుత్వ బడి అడ్మిషన్ల కోసం ఊరంత డప్పు చాటింపేశి ప్రచారం జేస్కుంట, ఊరొల్లకు సర్కారు బడి గొప్పతనం తెల్శేతట్టు జేశిండు. పొల్లగాండ్లను ఎంబడేస్కోని ఇంటింటికి తిర్గుకుంట ప్రవేటు బడుల్ల ఫీజులు కట్టి జేబులు ఖాళీ చూస్కోవద్దని ఉన్నమాట శెప్పిండు. అంతేగాదుల్లో సర్కారు బడిని కాపాడుకుంటమని, పొల్లగాండ్లను సర్కారు బడికే పంపుతమని ఊరొల్లను జమేశి బొడ్రాయి కాడ పతిగ్న గుడ చేయించిండు సారు.
ఇన్నరా.. సర్కారు బడి.. అని, సారంటె.. సూపర్ బడి పొల్లగాండ్లంటున్నరు. అంతేగాదు సర్కారు బడిల సద్వుకునే ఎంతోమంది పెద్ద పెద్ద స్థాయికి ఎదిగిర్రని ఇగో ఇట్ల పాట సుతం పాడిండు వీరమల్లు అనేటి ఈ అన్న.
ఇగ సారిట్ల డప్పు కొట్టుకుంట ఊరంత తిర్గి సర్కారు బడి గొప్పతనం శెప్పేటాళ్లకు ఊరొల్లకు సుతం మస్తు జోష్ అచ్చిందుల్ల. మా పిల్లలను తప్పకుంట ప్రభుత్వ బడికే పంపుతం అని మాట ఇచ్చిర్రట సారుకు. మంచి ముచ్చటే. ఇగిట్ల ఈడ ఒక్క కాడ అనే గాదు.. ఈనడ్మ ప్రవేటు బడులకు ఊర్లపొంటి గిట్ల గట్టి ఝలకే ఇస్తున్నరు ఆడాడ. మరిగ జనాలూ.. సర్కారు కొలువులకేమో సై అని, సర్కారు బడులంటె నై అన్నట్టు జెయ్యకుర్రుల్ల. ప్రభుత్వ బడులకు జై కొట్టుర్రి. అట్లనే పాలకులూ.. మీరు సుతం జర బడులను సక్కదిద్ది.. సర్కారు బడి అంటె సూపర్ బడి అనేతట్టు జెయ్యిర్రి.. ఆ.




