Jordar News: గుజరాత్ సింగర్ పై నోట్ల వర్షం.. వీడియో వైరల్

Jordar News: గుజరాత్ ద్వారక జిల్లాలో జరిగిన ఒక భజన కార్యక్రమంలో ప్రముఖ సింగర్ విరాట్ జిగ్నేష్‌పై భక్తులు నోట్ల వర్షం కురిపించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 May 2026 7:09 AM IST
Jordar News
X

Jordar News: గుజరాత్ సింగర్ పై నోట్ల వర్షం.. వీడియో వైరల్

Jordar News: వీళ్ల ఇచ్చంత్రం సల్లగుండ. మొస్సమర్రకుంట, మొకం కనవడకుంట అమాంతం పైసల్తోని ముంచేశిర్రు గద అన్నను. ఓ అన్నలూ.. జర్ర తియ్యరాదుర్రి. ఆయింత మొస్సాడక పర్శాన్ కాజిక్క. మీద సంచులతోని పైసలు కుమ్మరిచ్చినా.. అన్న ఇంత సుతం తగ్గుతలేడు. శృతిలయలు తప్పకుంట.. రాగం తీత్తనే ఉన్నడు. గుజరాత్ రాష్ట్రం ద్వారకా జిల్లా ఖంభాలియా అనే ఊర్ల వెట్టిన సంగీత కచేరీల ఇట్ల అభిమానంతోని సింగర్కు నోట్లతోని అభిషేకం జేశిర్రు అక్కడి జనాలు. అక్కడి జానపదాలు, భక్తి పాటలు పాడుట్ల కవిరాజ్ జిగ్నేషన్న మస్తు తోపట. ఇగాడ భజనలు పెడ్తే అచ్చి ఇట్ల అందర్ని గాత్రంతోని కట్టపడేశెటాలకు అభిమానాన్ని నోట్ల రూపంల సూపెట్టిర్రు. మరి ఇవ్వన్ని ఎన్ని పైసలన్నది లెక్క తేలలేదట కని, ఎప్పుడు గిట్ల భజన పెట్టినా.. గిట్లనే సద్విచ్చుకుంటరట శానామంది భక్త జనాలు. ఈ పైసలను సింగరైతే తీస్కపోడట కని, అచ్చిన పైసలను మంచి పనులు జేశెతందుకు వాడ్తరట. అటు దిక్కు ప్యాద ఆడవిల్లల సద్వుల కోసం స్కూల్ కట్టెతందుకు ఈ పైకాన్ని దానం జేత్తరట. మంచి పని కోసం ఈల్లు పాటిస్తున్న ఆశారమైతే మంచిగనే ఉన్నది కని.. ఇన్ని పైసలను కట్టలు కట్టెతందుకు తల్కాయ పానం తోకలకు అచ్చుండచ్చు మరి అటెంక.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story