Big Debate: ఓట్ల తొలగింపుపై ప్రతిపక్షాల ఆరోపణలు పచ్చి అబద్ధం.. బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి!

Big Debate: ఎస్‌ఐఆర్ (SIR) సర్వే మరియు ఓట్ల తొలగింపుపై వస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధమని బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.

Arun Chilukuri
Published on: 29 Sept 2026 11:48 AM IST
Big Debate: ఓట్ల తొలగింపుపై ప్రతిపక్షాల ఆరోపణలు పచ్చి అబద్ధం.. బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి!
X

Big Debate: దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్ (SIR) సర్వే ప్రక్రియ మరియు ఓట్ల తొలగింపు వ్యవహారంపై రాజకీయ దుమారం చెలరేగుతున్న తరుణంలో hmtv నిర్వహించిన 'బిగ్ డిబేట్' కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి పాల్గొని తన వాదనలను గట్టిగా వినిపించారు. మీడియాలో మరియు ప్రతిపక్షాల నుంచి వస్తున్న కథనాలు, విమర్శలు నిరాధారమని ఆయన కొట్టిపారేశారు.

జాతీయ మీడియాలో వచ్చిన కొన్ని కథనాలు కాంట్రడిక్షన్స్‌తో కూడిన పెయిడ్ ఆర్టికల్స్ లాగా ఉన్నాయని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.

డూప్లికేట్ ఓట్లు, షిఫ్ట్ అయిన ఓట్లను తొలగించే ప్రక్రియలో భాగంగానే ఈ సర్వే జరుగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు రక్షించబడుతుందని తెలిపారు.

ఎలక్షన్ కమిషన్ మరియు కేంద్ర ప్రభుత్వాన్ని బద్నామ్ చేసేలా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు సరికాదని, క్షేత్రస్థాయిలో నిజాలను గ్రహించాలని ఆయన హితవు పలికారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.