Big Debate: 20 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులెవరు?: కేంద్రంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

Big Debate: నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను ఖండిస్తూ హెచ్‌ఎమ్‌టీవీ బిగ్ డిబేట్‌లో మాట్లాడిన కాంగ్రెస్ నాయకుడు నరసింహ.

Arun Chilukuri
Published on: 23 July 2026 11:37 AM IST
Big Debate
X

Big Debate: 20 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులెవరు?: కేంద్రంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

Big Debate: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న నీట్ (NEET) పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం మరియు ఢిల్లీలో న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన దాడిపై 'హెచ్‌ఎమ్‌టీవీ (HMTV) బిగ్ డిబేట్' వేదికగా వేడివేడిగా చర్చ జరిగింది. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు నరసింహ, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

డిబేట్‌లో కాంగ్రెస్ నేత నరసింహ మాట్లాడుతూ.. "దేశంలో గత 21 రోజులుగా విద్యార్థులు దీక్షలు చేస్తుంటే కేంద్ర విద్యుత్ లేదా విద్యాశాఖ మంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ఎందుకు స్పందించలేదు?" అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇప్పటివరకు దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రీ-కండక్ట్ పేరుతో కాలయాపన చేయడం వల్ల విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయని, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని నిలదీశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story