Big Debate: ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ నేత రియాజుద్దీన్ తీవ్ర విమర్శలు!

Big Debate: ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు, వివాదాలపై hmtv నిర్వహించిన 'బిగ్ డిబేట్' ప్రత్యేక చర్చ.

Arun Chilukuri
Published on: 29 Sept 2026 11:18 AM IST
Big Debate
X

Big Debate: ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ నేత రియాజుద్దీన్ తీవ్ర విమర్శలు!

Big Debate: దేశంలోని ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు, ఓటర్ల జాబితా సవరణ వివాదాలు, ఎన్నికల సంఘం (ECI) పనితీరుపై hmtv ఛానెల్ 'బిగ్ డిబేట్' కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ చర్చా వేదికలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రియాజుద్దీన్‌తో పాటు పలువురు రాజకీయ విశ్లేషకులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

దేశంలో ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతను కోల్పోతోందని, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ నేత రియాజుద్దీన్ ఆరోపించారు.

ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, చిన్నచిన్న కారణాలతో లక్షలాది మంది ఓట్లను తొలగించడం సరికాదని విమర్శించారు.

ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాలని, రాజ్యాంగ సంస్థలు మరింత పారదర్శకంగా పని చేయాల్సిన అవసరం ఉందని చర్చలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.