HMTV Health Conclave: ఆరోగ్య రంగ ప్రముఖుల సమక్షంలో వైభవంగా 'హెచ్‌ఎమ్‌టీవీ హెల్త్ కాంక్లేవ్': ఉచిత వైద్య శిబిరానికి పోటెత్తిన ప్రజలు
HMTV Health Conclave: హైదరాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో ఘనంగా జరుగుతున్న హెచ్‌ఎమ్‌టీవీ హెల్త్ కాంక్లేవ్. ఉచిత వైద్య శిబిరానికి పోటెత్తిన ప్రజలు. ప్రముఖ వైద్యుల సలహాలు.
HMTV Health Conclave: ఆరోగ్య రంగ ప్రముఖుల సమక్షంలో వైభవంగా 'హెచ్‌ఎమ్‌టీవీ హెల్త్ కాంక్లేవ్': ఉచిత వైద్య శిబిరానికి పోటెత్తిన ప్రజలు
HMTV Health Conclave: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ వేదికగా హెచ్‌ఎమ్‌టీవీ, ది హన్స్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'హెచ్‌ఎమ్‌టీవీ హెల్త్ కాంక్లేవ్ & అవార్డ్స్' కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఆరోగ్య రంగ నిపుణులు, ప్రముఖ వైద్యులు పెద్దఎత్తున హాజరైన ఈ సదస్సులో, సామాన్య ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపునకు అపూర్వ స్పందన లభిస్తోంది.
నగరంలోని ప్రముఖ ఆసుపత్రులు, ఆయుర్వేద సంస్థలు (కపిల్ ఆయుర్వేద, శ్రీకర, అమర్ హాస్పిటల్స్ తదితర సంస్థలు) ఈ మెడికల్ క్యాంపులో ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి.
ఉదయం నుంచి ప్రారంభమైన ఈ శిబిరంలో వందలాది మంది నగర వాసులు పాల్గొని బీపీ, షుగర్, ఎముకలు, కీళ్ల నొప్తులు, నరాల సమస్యలు తదితర ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేయించుకున్నారు.
అనుభవజ్ఞులైన వైద్యులు నేరుగా రోగులను పరీక్షించి, వారి ఆరోగ్య సమస్యలపై తగు సలహాలు, మందుల సూచనలు అందజేశారు.
ఆధునిక జీవనశైలిలో తలెత్తుతున్న అనారోగ్య సమస్యలను నివారించేందుకు ఆయుర్వేద వైద్య విధానం, పంచకర్మ చికిత్సలు, సరైన ఆహారపు అలవాట్ల (దినచర్య) ప్రాముఖ్యతను వైద్య నిపుణులు ప్రజలకు వివరించారు.
వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న ప్రముఖులను సత్కరించడంతో పాటు, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా ఈ కాంక్లేవ్‌ను నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరం ద్వారా ఖైరతాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్దఎత్తున లబ్ధి పొందారు.




