News Analysis: నీతులు చెప్పడం కాదు.. పాటించాలి: విపక్షాలకు బిజేపి కౌంటర్!

News Analysis: నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదం, రాజీనామాల డిమాండ్ మరియు విపక్షాల ఆరోపణలపై హెచ్‌ఎమ్‌టీవీ న్యూస్ అనాలిసిస్ డిబేట్‌లో బిజేపి ప్రతినిధి నాగార్జున ధీటైన కౌంటర్ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 23 July 2026 1:22 PM IST
News Analysis: నీతులు చెప్పడం కాదు.. పాటించాలి: విపక్షాలకు బిజేపి కౌంటర్!
X

News Analysis: దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంపై హెచ్‌ఎమ్‌టీవీ (HMTV) న్యూస్ అనాలిసిస్ డిబేట్‌లో తీవ్ర వాడివేడి చర్చ జరిగింది. విపక్షాల ఆరోపణలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్లపై భారతీయ జనతా పార్టీ (BJP) ప్రతినిధి నాగార్జున తీవ్రంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి రాజీనామాలు మార్గం కాదని, కఠిన చర్యలు తీసుకోవడమే నిజమైన పరిష్కారమని విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్, ఇతర పార్టీలు చేస్తున్న డిమాండ్లను నాగార్జున తోసిపుచ్చారు. మంత్రి రాజీనామా చేస్తే భవిష్యత్తులో పేపర్ లీకేజీలు ఆగిపోతాయా అని నిలదీశారు. ప్రతిపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజీనామాలు డిమాండ్ చేయడం కాకుండా, లీకేజీలను అరికట్టడానికి ఏవైనా మంచి సూచనలు, పరిష్కారాలు ఉంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story