Jordar Varthalu: ట్రాఫిక్ పోలీసుల పనికి జనం నీరాజనాలు
Jordar Varthalu: ట్రాఫిక్ పోలీసుల మానవత్వం! రోడ్డుపై పడిపోయిన వడ్లను సంచుల్లో నింపేందుకు రైతుకు సాయం చేసిన ట్రాఫిక్ పోలీసులు.
Jordar Varthalu: ట్రాఫిక్ పోలీసుల పనికి జనం నీరాజనాలు
Jordar Varthalu: ట్రాఫిక్ పోలీసులంటె బాట ఎంబడి బండ్ల మీద పొయ్యేటొల్లను ఇబ్బంది పెడ్తరు.. లీడర్ల సేవల, ఉన్నొల్ల సేవల తరిస్తరు.. అని అనుకుంటె పొరపాటుల్ల.. కొందరుంటరు అట్లుంటరు గావచ్చు.. ఇంకొందరికి డ్యూటీల భాగంగ అట్ల శెయ్యక తప్పక పోవచ్చు.. కని, అందరు అట్ల గాదు.. ఇగో ఈ ట్రాఫిక్ పోలీసులైతింక మనసున్నొల్లబ్బ.. మహబూబ్ నగర్ కాడ ఓ రైతన్న ఎవుసం మార్కెట్కు వడ్లు కొంటవోతాంటె ట్రాక్టరు మీదికెంచి వడ్లు కిందపడ్డయని కొద్ది సాయం చెయ్యలేదు. తొవ్వ మీద అచ్చేటి బండ్లు వడ్లను తొక్కకుంట ట్రాఫికును ఆపిర్రు. కిందపడ్డ వడ్లను బస్తాల్ల నింపేందుకు సాయం పట్టిర్రు.
ట్రాఫిక్ పోలీస్లు తిప్పల సూశి, బాటెంబడి బండ్ల మీద పొయ్యేటొల్లు సుతం బండ్లాపి మరీ ఓ శెయ్యేశిర్రు. ఐకమత్యమే మహాబలం అన్న నానుడిని నిజం జేశిర్రు. రైతున్నకు మేమున్నం అనే బరోసా ఇచ్చిర్రు. మస్తు టైం బట్టింది వడ్లు కుప్పజేశి సంచుల్ల నింపేవరకు. ఓపక్క ట్రాఫికును కంట్రోల్ జేసుడు.. ఇంకోపక్క బండ్ల మీద పొయ్యేటొల్లను బతిమాలుడు.. రొండు గంటలు తిప్పలడ్తెగని, కిందవడ్డ వడ్లు బస్తాలకు శేరలేదు. వెంటన్న అట ట్రాఫికు పోలీసు పేరు. మంచి మనసు అన్నది. అందుకే మస్తు మెచ్చుకున్నరు ట్రాఫికు పోలీసుల మంచితనం శెయ్యంగ అక్కడున్నొల్లందరు. ఈ వార్త ఇన్నొల్లు సుతం శభాష్ ట్రాఫిక్ పోలీసులు అని మస్తు తారీఫ్ జేస్తున్నరు. ఏమైనా మనిషికి మనిషే ఆసరా.. ఆపదత్తె ఉన్నొల్లు, లేనొల్లు.. అధికారులు, సామాన్యులు అన్న తేడాలేం ఉండొద్దు.. అందరు ఒక్కటి గావాలె.. ఆపదను తరిమెయ్యాలె.. ఏమంటరుల్ల.




