Jordar Varthalu: ఏసీబీ చిక్కిన అవినీతి తిమింగలం..కొల్వుకు ఎక్కగానే మొదలైన లంచాలు
Jordar Varthalu: హుజూరాబాద్ మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి రూ. 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.
Jordar Varthalu: ఏసీబీ చిక్కిన అవినీతి తిమింగలం..కొల్వుకు ఎక్కగానే మొదలైన లంచాలు
Jordar Varthalu: అర్రర్రె ఎంత పనైపాయె. పాపం.. సారు పబ్లిక్కు సర్వీస్ ఇయ్యకుంట జేశిర్రు గదా ఏసీబోల్లు. తొల్సూరు పోస్టింగులనే, పోస్టు ఊస్టయ్యే పన్జేశిర్రు. ప్రొబేషనరీ టైము గడ్వకముందే, గేట్లు దాటి గెటౌట్ అన్నంత పన్జేశిర్రు గదా. అసలు ముచ్చటేందంటే.. ఇగో ఈడ ఏంతెల్వని ఎర్రిపప్పలెక్క కానొస్తున్న మోతెవరి పేరు నూసుం సుధాకర్ రెడ్డి. హుజురాబాద్ మున్సిపాల్టీ ఆఫీస్ల అసిస్టెంట్ ఇంజనీర్గ ఉత్తుత్త సేవలు ఇచ్చుకుంట, లంచాల సేవల మున్గి తేలుతున్నడట. మొన్నట్ల కట్టిన ఒగ మోరి పనికి, బిల్లచ్చెతందుకు కాంట్రాక్టర్ను యాభైవేల కట్నం సద్వుచ్చుకోవాల్నని హుకూం జారీ జేశిండట.
ఉత్తగ జెయ్యాల్శిన పనికి, ఉత్తగ యాభైవేలు పెట్టుడెందుకని ఏసీబోల్లకు మత్లావ్ పంపుతె. ఇయ్యాల దిగిర్రు వాళ్లు. డిపో క్రాస్ కాడ యాభైవేల కట్ట జేబుల పెట్టుకుంటాంటె..లట్కన పట్టుకున్నరు. ఇగ కెమికల్ నీళ్లల్ల శేతులు కడిగిపిత్తె, కాక బండారం బైటవడ్డది. తీస్కపొయ్యి కోర్టుకు అప్పజెప్పిర్రు. అటెంక కటకటాల పాలవ్వుడే ఆల్శమున్నది కని, ఇసొంటి లంచగొండులు జనాలల్ల తిర్గుతె ఎంత పర్శానుంటది చెప్పుర్రి. సుధాకర్ రెడ్డి మీద ఇప్పటికే ఇసొంటి లంచాల ముద్రలు బగ్గనే ఉన్నయట. ఈ మోతెవరి, కొల్వుకెక్కిన తొల్సూరు ఏడాదిలనే ఇంత జేశిండంటే.. ఇంక రేపు రేపు ఇంకెంత జేసునో. పబ్లిక్ రక్తాన్ని జలగలెక్కనే పీర్శెటోడు కావచ్చు. జనాలూ.. ఇట్లనే, ఎవలన్న లంచాల మాటెత్తుతె ఏసీబోల్లకు అప్పజెప్పుర్రి, మీ పైసలు కాపాడుకోర్రి సరేనా.




