Big Debate: హైదరాబాద్‌లో 73 లక్షల ఓట్లు గల్లంతు? మల్లయ్య యాదవ్ సంచలన వ్యాఖ్యలు!

Big Debate: హైదరాబాద్‌లో ఓటర్ల జాబితా లొసుగులు, 73 లక్షల ఓట్లు డిజిటలైజ్ కాకపోవడంపై బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్పందన.

Arun Chilukuri
Published on: 12 Aug 2026 11:33 AM IST
Big Debate
X

Big Debate: హైదరాబాద్‌లో 73 లక్షల ఓట్లు గల్లంతు? మల్లయ్య యాదవ్ సంచలన వ్యాఖ్యలు!

Big Debate: తెలంగాణ వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ఓటర్ల సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ముగియడంతో, హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలో లక్షలాది ఓట్లు డిజిటలైజ్ కాకపోవడం మరియు తొలగింపునకు గురికావడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. ఈ వ్యవహారంపై హెచ్‌ఎమ్‌టీవీ (hmtv) నిర్వహించిన 'బిగ్ డిబేట్' కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడారు.

హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి మరియు రంగారెడ్డి జిల్లాల పరిధిలో దాదాపు 40% నుండి 50% పైగా ఓట్లు డిజిటలైజేషన్ కాకపోవడంపై చర్చ సాగింది. ప్రధానంగా శేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న సుమారు 7 లక్షల ఓట్లలో దాదాపు 3.30 లక్షల ఓట్లు, కూకట్‌పల్లిలో 3 లక్షల ఓట్లు 'అన్ కలెక్టబుల్' కేటగిరీలోకి చేరడం పట్ల నగరవాసులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. క్షేత్రస్థాయిలో బి.ఎల్.ఓ (BLO)లు మెజారిటీ ఇళ్లకు వెళ్లకపోవడం కూడా దీనికి ఒక కారణమని పలువురు అభిప్రాయపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story