News Analysis: మెట్రోపై రేవంత్ సర్కారు అసమర్థత.. కేంద్రం పక్షపాతం: బీఆర్ఎస్ ఫైర్!

News Analysis: హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల సేకరణలో రేవంత్ రెడ్డి సర్కారు అసమర్థత వల్లే జాప్యం జరుగుతోందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణపై పక్షపాతం చూపిస్తోందని బీఆర్ఎస్ నేత సుమిత్రా ఆనంద్ మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 3 Aug 2026 11:33 AM IST
News Analysis
X

News Analysis: మెట్రోపై రేవంత్ సర్కారు అసమర్థత.. కేంద్రం పక్షపాతం: బీఆర్ఎస్ ఫైర్!

News Analysis: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ, నిర్వహణ విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పక్షపాత వైఖరి స్పష్టంగా బయటపడుతున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుమిత్రా ఆనంద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. hmtv నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, మెట్రో విషయంలో రెండు జాతీయ పార్టీల తీరును తీవ్రంగా తప్పుపట్టారు.

రాష్ట్ర హక్కుల సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పోరాడాల్సిన స్థానంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీ, కేంద్ర సర్కార్ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారని సుమిత్రా ఆనంద్ విమర్శించారు. "కేవలం 4 శాతం వడ్డీకే రుణాలు తెస్తామని డాంబికాలు పలికిన రేవంత్ రెడ్డి, మెట్రో స్వాధీనానికి అవసరమైన రూ. 13,600 కోట్లను ఇప్పటివరకు ఎందుకు సేకరించలేకపోయారు?" అని నిలదీశారు.

తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు, బీజేపీకి చెరో 8 మంది ఎంపీ సీట్లను గెలిపించినప్పటికీ, రాష్ట్ర అభివృద్ధికి రెండు పార్టీలూ చేసిందేమీ లేదని ఆమె దుయ్యబట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆగిపోయిన మెట్రో పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని గుర్తుచేసిన ఆమె, కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేయకుండా పూటకో మాట మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story