News Analysis: మెట్రో ఫేజ్-2కు కేంద్రం నిధులేవీ?.. బీజేపీ మంత్రులపై కాంగ్రెస్ నేత జితేందర్ ఫైర్!
News Analysis: హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ (Metro Phase-2) విస్తరణ, నిధుల మంజూరుపై తెలంగాణలో రాజకీయ కాక రేగుతోంది.
News Analysis: మెట్రో ఫేజ్-2కు కేంద్రం నిధులేవీ?.. బీజేపీ మంత్రులపై కాంగ్రెస్ నేత జితేందర్ ఫైర్!
News Analysis: హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ (Metro Phase-2) విస్తరణ, నిధుల మంజూరుపై తెలంగాణలో రాజకీయ కాక రేగుతోంది. ఈ అంశంపై తాజాగా జరిగిన hmtv చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జితేందర్ పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై, గత బీఆర్ఎస్ (BRS) పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో దాదాపు రెండు కోట్ల మంది జనాభా నివసిస్తున్నారని.. ట్రాఫిక్, కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణ, ఈవీ (EV) బస్సులు అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.
గత 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి నగరాభివృద్ధిపై సోయి లేదని విమర్శించారు. మొదటి దశ మెట్రో నిర్మాణ సమయంలో ఎల్అండ్టీ (L&T) సంస్థకు భూసేకరణ తదితర విషయాల్లో గత ప్రభుత్వం సహకరించకపోవడం, కోవిడ్ సంక్షోభం రావడం వల్ల ప్రాజెక్ట్ నష్టాల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. కేసీఆర్ నిధులన్నింటినీ కాళేశ్వరం ప్రాజెక్టుకే మళ్లించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు.




