News Analysis: మెట్రో ఫేజ్-2పై పొలిటికల్ వార్.. రేవంత్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ నేత దత్తాత్రేయ ఫైర్!

News Analysis: హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ (Metro Phase-2) నిధుల సమకూర్పు, ఫ్యూచర్ సిటీ రూట్ పొడిగింపు వ్యవహారంపై తెలంగాణలో రాజకీయ చర్చ తీవ్ర రూపం దాల్చింది.

Arun Chilukuri
Published on: 23 Jun 2026 11:32 AM IST
News Analysis
X

News Analysis: మెట్రో ఫేజ్-2పై పొలిటికల్ వార్.. రేవంత్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ నేత దత్తాత్రేయ ఫైర్!

News Analysis: హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ (Metro Phase-2) నిధుల సమకూర్పు, ఫ్యూచర్ సిటీ రూట్ పొడిగింపు వ్యవహారంపై తెలంగాణలో రాజకీయ చర్చ తీవ్ర రూపం దాల్చింది. ఈ అంశంపై తాజాగా జరిగిన hmtv చర్చా కార్యక్రమంలో బిఆర్ఎస్ (BRS) సీనియర్ నాయకులు డాక్టర్ దత్తాత్రేయ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని, మరోసారి బీఆర్‌ఎస్‌ను తిడుతూ రాజకీయాలు చేస్తున్నారే తప్ప ప్రాజెక్టును పక్కాగా ముందుకు తీసుకెళ్లాలనే చిత్తశుద్ధి ఆయనకు లేదని విమర్శించారు. ఢిల్లీకి వందసార్లు వెళ్లే సీఎంకు కేంద్ర మంత్రులను కలిసి సమస్యలు పరిష్కరించుకునే అవగాహన లోపించిందని అన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story