News Analysis: హైదరాబాద్ మెట్రోపై చేతులెత్తేసి కేంద్రంపై నిందలా?.. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత అమర్నాథ్ ధ్వజం!
News Analysis: హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల సాధనలో సీఎం రేవంత్ రెడ్డి వైఫల్యాన్ని ఎండగడుతూ బీజేపీ సీనియర్ నేత అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
News Analysis: హైదరాబాద్ మెట్రోపై చేతులెత్తేసి కేంద్రంపై నిందలా?.. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత అమర్నాథ్ ధ్వజం!
News Analysis: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ (ఫేజ్-1 పెండింగ్ పనులు, ఫేజ్-2 విస్తరణ) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందని బీజేపీ సీనియర్ నాయకుడు అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. hmtv నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మెట్రో విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు.
మెట్రో ఫేజ్-2 కు అనుమతులు అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ఫేజ్-1 కింద ఇప్పటికీ పూర్తికాని కీలక పనులపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతోందని అమర్నాథ్ విమర్శించారు. ముఖ్యంగా పాతబస్తీ ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు లైన్ను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రభుత్వం వద్ద ఎలాంటి నివేదిక లేదా ప్రణాళిక లేదన్నారు.




