News Analysis: మెట్రో ఫేజ్-2పై కేంద్రం వివక్ష.. కాంగ్రెస్ నేత గౌరి సతీష్ ఆరోపణ!

News Analysis: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ నిధుల కేటాయింపులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై తీవ్ర వివక్ష చూపిస్తోందని కాంగ్రెస్ నాయకుడు గౌరి సతీష్ ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 3 Aug 2026 11:21 AM IST
News Analysis
X

News Analysis: మెట్రో ఫేజ్-2పై కేంద్రం వివక్ష.. కాంగ్రెస్ నేత గౌరి సతీష్ ఆరోపణ!

News Analysis: హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 విస్తరణ ప్రాజెక్టు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల తీవ్ర వివక్ష చూపుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గౌరి సతీష్ ఆరోపించారు. hmtv నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, మెట్రో నిధుల విడుదల, అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు.

రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు రాజకీయాలను పక్కనపెట్టి కేంద్ర మంత్రులు, రైల్వే శాఖ మంత్రి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో పలుమార్లు సమావేశమయ్యారని గౌరి సతీష్ గుర్తుచేశారు. భూసేకరణ, అంచనా వ్యయం, నిర్వహణ బాధ్యతలు వంటి అన్ని వివరాలతో పక్కాగా సమగ్ర ప్రాజెక్టు నివేదికను (DPR) తయారు చేసి కేంద్రానికి సమర్పించామని స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story