Jordar Varthalu: దోమలకు దొర్కకుండా వెరైటీ ఉపాయంసెక్యూరిటీ కాక చేసిన పనికి అంతా షాక్
Jordar Varthalu: హైదరాబాద్‌లో దోమల బెడద ఏ స్థాయిలో ఉందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
Jordar Varthalu: దోమలకు దొర్కకుండా వెరైటీ ఉపాయంసెక్యూరిటీ కాక చేసిన పనికి అంతా షాక్
Jordar Varthalu: ఒరక్కో.. కాకకు ఏం తిప్పలచ్చిందుల్లో ఈ దోమలు శెయ్యంగ. దోమల పర్ద కప్పుకోని మరీ డ్యూటీ జేస్తున్నడు గదా. మొన్నట్ల కారు పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారు నోట్లెకు దోమల్ పోతన్నయని ప్రెస్మీటుకు దోమల తెర ఏసుకోనత్తె గిట్టనొల్లంత ఉత్తముచ్చట అనుకున్నరు. కని ఆ ముచ్చట యాది మర్వకముందే ఇగో ఈ వీడియో వైరల్ ఐతాందిప్పుడు. సుధీర్ రెడ్డి సారంటె ఎగస్ పార్టీ లీడరు.. సర్కారు మీద లేనిపోనియి పుట్టిస్తున్నడనుకోవచ్చు గని, గీ కాకాది ఏ పార్టుల్ల. దోమల తోటి ఎంత తిప్పలుంటె గిట్ల దోమల పర్ద కప్పుకోని డ్యూటీ జేస్తడు శెప్పుర్రి. ఏ ఏరియానో, ఏ అపార్టుమెంటుకు సెక్యూరిటీ కొలువు జస్తున్నడో గని, పట్నంల దోమల్ ఏ రేంజిలున్నయో గీ సెక్యూరిటీ కాక పడ్తున్న తిప్పలు సూశి శెప్పొచ్చుల్ల,. ఇంతకు కాకేమంటున్నడో ఇనుర్రో పారి.
అదుల్ల ముచ్చట. కాక గట్టిగ శెప్తలేడు గని, కాక కట్టిన ఏశం సూశి శెప్పొచ్చు.. ఇది హైదరాబాదా.. దోమలాబాదా అనేటిది. పాలిస్తున్నది శెయ్యి పార్టొల్లు.. పెత్తనం మొత్తం దోమలది అన్నట్టున్నది పోన్రి. ఎగస్ పార్టొల్లు దోమల హిల్సు, దోమలగుట్ట, దోమలబాదు అని ఎడ్డిచ్చినా.. ప్రెస్మీట్లకు దోమల పర్ద తొడుక్కోని అచ్చినా నెల రోజుల వట్టి గింత గుడ చలనం లేదు సర్కారొల్లకు.. మరి గిట్ల కామన్ పబ్లిక్కు పడ్తున్న తిప్పలు సూశైనా దోమల మీద దండయాత్రకు కదుల్తరో సర్కారొల్లు.. లేకుంటె ఎగస్ పార్టొల్లు శెప్తనే ఇనలేదని సూశి సూడనట్టు సప్పుడ్జేకనే ఉంటరో సూడాలె.




