Jordar Varthalu: గుట్కాలు అమ్మితే ఇక అంతే
Jordar Varthalu: హైదరాబాద్‌లో విద్యాసంస్థల సమీపంలో గుట్కా, సిగరెట్ల అమ్మకాలపై పోలీసుల దాడులు. సేఫ్ స్కూల్ ప్రాజెక్ట్ పేరుతో 500 పాన్ షాపులపై సోదాలు.
Jordar Varthalu: గుట్కాలు అమ్మితే ఇక అంతే
Jordar Varthalu: వీడియో సూడంగనే మీకు ముచ్చటేందో కొంత వరకు సముజయ్యే ఉండవచ్చుగదా. అవ్ మీరనుకున్నట్టే అయ్యింది. సేఫ్ స్కూల్ పేరు మీద పట్నం పోలీసులు స్పెషల్ డ్రైవ్ జేశిర్రియ్యాల. పట్నంలున్న విద్యాసంస్థలకు నూరు మీటర్ల పరిధిలుండే పాన్ షాప్ల మీద దాడులు జేశి గుట్కాలు, జర్దా పొట్లాలు, సిగరెట్లను సీజ్ జేశి అవ్విటి యజమానుల మీద కేసులు రాశిర్రు. ఇయ్యాల ఒక్కనాడే దగ్గరిదగ్గర ఐదువందల విద్యాసంస్థల చుట్టుపక్కల పాన్ షాపులు నడిపేటోళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చిర్రు పోలీసులు. పిల్లలు మొదట్ల సిగరెట్లు అటెంక డ్రగ్సుకు సుతం అల్వాటుపడే శాన్సుంటదిగావట్టి., ముందు నుంచే కట్టడి జెయ్యాల్నని సూస్తున్నరు పోలీసులు. ఇగీ ముచ్చట మీద సజ్జనార్ సారు ఏం జెప్తున్నడో ఇనుర్రోపారి.
అవ్.. సజ్జనార్ సారు జెప్పినట్టు.. ఊన్నోళ్లు లేనోళ్లు అని ఏం లేదు. అందరి పిల్లలు స్కూల్లకు, కాలేజీలకు పోతరు గావట్టి., అక్కడ్నే వాళ్లు గుట్కాలు, సిగరెట్లకు అల్వాటయ్యే శాన్సుంటది. గందుకే పిల్లలకు అందుబాటుల లేకుంట జెయ్యాల్నని పోలీసులు ఈ పని ముంగటేస్కున్నరు. ఇగిదేగాదు., అటు డ్రగ్సు మీద గుడ గట్టి నిఘానే పెట్టిన పోలీసులు మత్తు పదార్థాలు పట్నం శివార్లకు సుతం రాకుంట కట్టడి జేస్తున్నరు. 500 షాపుల మీద వారం రోజుల సంది నిఘా వెట్టిర్రట. ఎక్కడెక్కడ పొగాకు పదార్థాలు అమ్ముతున్నరో ఆ షాపుల వీడియోలు గుడ విడ్దల జేస్తమని జెప్పిండు సజ్జనార్ సారు. మొత్తానికైతే., ఆల్శమైనా మంచి నిర్ణయమే జేశిర్రు పోలీసులు.




