Jordar News: రాంగ్ రూట్ లో వచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్ ను కొట్టిండు
Jordar News: హైదరాబాద్ బంజారాహిల్స్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులపై జీహెచ్ఎంసీ అధికారులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది.
Jordar News: రాంగ్ రూట్ లో వచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్ ను కొట్టిండు
Jordar News: వీని రుబాబు పాడుగాను.. ట్రాఫిక్ పోలీసన్న మీదికే కయ్యిమని లేత్తున్నడు. ఆఫీసర్ను నన్నే ఆపుతవా అనుకుంట పటపట పండ్లు కొరుక్కుంట ట్రాఫిక్ పోలీసన్న శెయ్యినే ఇర్వ సూశిండు తాశిడి మొఖపోడు.
వాయిస్.. బండెక్కి పారారైతరని, పోలీసన్న కార్ల కూసుంటె.. వీని సొమ్మేమో తిన్నట్టు, నీ అయ్యదా బండ్లెక్కినవనుకుంట బూతు పురాణం సద్విండు. పట్నం దిక్కు బంజారాహిల్స్ కాడ గల్లీల, ఒగ దిక్కు తొవ్వ పనులు జర్గుతున్నట్టున్నయ్. అటు దిక్కు నుంచి బండ్లు పోకుంట ఆపిర్రు. ఇగ గంతె ఆపీసర్ను నాకెక్కడియ్ రూల్సన్నట్టే రాంగు రూట్లచ్చి ఆగమాగం జేశిర్రు. గట్లెట్ల పోతరని పోలీసన్న వీడియో తీత్తుంటె అధికార మదం సూపెట్టిర్రు జీహెచ్ ఎంసీల పన్జేశే ఏఈగ కొల్వు జేత్తున్న ఆనందు, శానిటరీ ఇన్స్ పెక్టర్ అమితు. సుట్టు ముట్టు జనాలు, కెమ్రాలు లేకుంటె దౌడ మీద ఒక్కటేశి ట్రాఫిక్ రూల్సు సంటి పోరలకు చెప్పినట్టు చెప్పెటోడు కావచ్చు కనీ.. పాపం చేశేదేం లేక పై ఆఫీసర్లకు ఫోన్ల ముచ్చట జెప్పిండు.
పోలీస్ విధులకు ఆటంకం కల్గించిర్రని ఈ ఇద్దరి మీద కేసు రాశి, ఎంక్వైరీ జేత్తున్నరట పెద్దాఫీసర్లు. గీ మోతెవరి ఆఫీసర్నని చెప్తున్నడు కనీ ఈనెకు ఇసుమంత ఇంగితం లేనట్టుంది. ఎన్నడో శిన్నప్పుడే చెప్పే రాంగురూట్ల బండ్లు తోలద్దని, అవ్వన్ని సద్వకుంటనే, పైసలిచ్చి పాసైండో ఈనె మరి. ఒగాల పెద్ద ఆఫీసర్ను.. అని ఈనె అనుకుంటె, కింది స్థాయి ఉద్యోగి చెప్పినప్పుడు ఇనకుంటె ఈనె ఏం ఆఫీసరో ఈనెకే తెల్వాలె. అయ్యా డీజీపీ సారూ సూస్తున్నరు గద ట్రాఫిక్ పోలీసోల్ల తిప్పలు ఎట్లున్నయో. ఈల్ల తిప్పలు తీర్శెతట్టు తాశిడిగాల్ల మీద గొట్టు శిక్షలేశి, మల్లోతాప శెయ్యి ఎయ్యాల్నంటెనే గజ్జున వన్కెతట్టు జెయ్యుర్రి సరేనా.




