Jordar Varthalu: ఆర్మీ మందుతో దందా.. చివరికి ఇలా అయ్యింది!

Jordar Varthalu: హైదరాబాద్ హస్తినాపురంలో 10 లక్షల విలువైన ఆర్మీ మద్యం బాటిళ్లు సీజ్. మాజీ సైనికుడు సురేష్ రెడ్డి అక్రమ దందా గుట్టురట్టు చేసిన ఎక్సైజ్ అధికారులు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 April 2026 6:54 AM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: ఆర్మీ మందుతో దందా.. చివరికి ఇలా అయ్యింది!

Jordar Varthalu: డిఫెన్స్ క్యాంటీన్లలో లభించే మద్యానికి బయట భారీ డిమాండ్ ఉండటాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ వ్యాపారానికి తెరలేపిన ఒక మాజీ ఆర్మీ ఉద్యోగి ఉదంతం వెలుగులోకి వచ్చింది. హస్తినాపురంలోని శ్రీరమణ కాలనీలో నివాసముంటున్న దొడ్డి సురేష్ రెడ్డి అనే వ్యక్తి, ఇతర రాష్ట్రాల డిఫెన్స్ క్యాంటీన్ల నుండి అక్రమంగా మద్యం బాటిళ్లను తెప్పించి నగరంలో విక్రయిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది.

విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి, సుమారు ₹10 లక్షల విలువైన 361 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో అన్నీ ₹2000 పైబడిన ఖరీదైన బ్రాండ్లే ఉండటం గమనార్హం. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. తెలంగాణ ఎక్సైజ్ ఆదాయానికి గండి కొడుతున్న ఇటువంటి ముఠాల వెనుక ఉన్న అసలు సూత్రధారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story