Burning Topic: రైతులకు చేదు వార్త.. వర్షాలు రాకుండా చేస్తున్న ఎల్ నినో!

Burning Topic: దేశంలో ఎల్‌నినో ప్రభావంతో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి (IMD) హెచ్చరించింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 Aug 2026 6:37 AM IST
Burning Topic
X

Burning Topic: రైతులకు చేదు వార్త.. వర్షాలు రాకుండా చేస్తున్న ఎల్ నినో!

Burning Topic: వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది చేదు వార్తే.. దేశంలో ఎల్‌నినో తీవ్రత కారణంగా ఇప్పటికే వర్షపాతం అంతంత మాత్రంగా ఉంది. కొన్ని రాష్ట్రాలలో భారీ వర్షాలు, వరదలు కొనసాగుతుంటే చాలా రాష్ట్రాల్లో అసలు వానలే లేవు. జూన్, జులై మాసాల్లో నైరుతి రుత పవనాల ప్రభావం పెద్దగా కనిపించలేదు.

ఇక ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది భారత వాతావరణ శాఖ. దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాల తీవ్రత తగ్గి, పగటితో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది.




హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story