Jordar News: ఈ బండికి పెట్రోల్ అవసరం లేదు..

Jordar News: నిర్మల్ జిల్లా విద్యార్థుల అద్భుత సృష్టి! పెట్రోల్, కరెంట్ లేకుండానే నడిచే 'దేశీ టెస్లా' బండి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Jun 2026 7:12 AM IST
Jordar News
X

Jordar News: ఈ బండికి పెట్రోల్ అవసరం లేదు..

Jordar News: పల్లెటూరు రేసింగ్ బండుల్లో గిది. పెట్రోల్ అవుస్రం లేదు.. కరెంటు ఛార్జింగుతోటి పనిలేదు. ఎండ్ల బండికి ఎక్వ, ఆడి కారుకు తక్వ. దేశి టెస్లా అనుకోరాదుర్రిగ. పగ్గం ఇడ్శిపట్టుకుంటె ఉర్కుతది.. గుంజి పట్టుకుంటె ఆగుతది. ఆవు మూడును పట్టి వేగం అందుకుంటది. అన్భవంగల్ల ఎద్దయితె డ్రవర్తోటి గుడ పనిలేదుల్లో.. ఎక్కి కూసుంటె అదే తోలుకపోతది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం డోడర్న తండా నుంచి రాబోయే రోజుల్ల కాబోయే యువ ఇంజనీరు తమ్ముళ్లు ఇగురం కొద్ది తయార్జేశిర్రిట్ల. ఇగ తయార్జెయ్యంగనే అయిపోతదా.. ఎలన్ మస్క్ సారు రేంజిల ట్రాయల్ రన్నేశిర్రిట్ల ఓపారి.

ఓ తమ్ముడు పైకెక్కి సవారీ జేస్తుంటె కడ్మ తమ్ముళ్లంత సెక్యూరిటీ లెక్క నిలవడి, ఈ దేశీ టెస్లా బండిని ట్రాక్ తప్పకుంట సూస్కున్నరు. తమ్ముళ‌్ల సంబురం సూత్తాంటె ట్రాయల్ రన్ను సక్సెస్ అయినట్టే ఉన్నది. సూత్తాంటె ఇసోంటి బండ్లు ఇంకిన్ని తయార్జేశి పల్లెటూరు ఫార్ములా వన్ రేసింగ్ గుడ పెట్టేతట్టే ఉన్నరు గదా. ఏమైనా కొత్త రకం పోకడలకు పోకుంట, ఫోండ్ల తల్కాయపెట్టి రీల్సు గీల్సు సూడకుంట ఎండకాలం సెల్వులను పల్లెటూరి ఆటలతోటి ఎంజాయ్ జేసుకుంట పాత రోజులను యాదికి జేస్తున్న ఈ తమ్ముళ్లను తారీఫ్ జెయ్యాల్సిందే పోన్రి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story