BurningTopic: రూటు మార్చిన భారత్.. సామాన్యుడికి గుడ్ న్యూస్
BurningTopic: అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య భారత్ తన ఇంధన దిగుమతి వ్యూహాన్ని ఎలా మార్చుకుంది?
BurningTopic: రూటు మార్చిన భారత్.. సామాన్యుడికి గుడ్ న్యూస్
BurningTopic: అమెరికా- ఇరాన్ శాంతి ఒప్పందం నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాలో కీలకంగా ఉన్న హర్మూజ్ జలసంధి పూర్తి స్థాయిలో తిరిగి తెరుచుకుంటోంది. ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు 20% హర్మూజ్ జలసంధి ద్వారానే రవాణా జరుగుతోంది. గత కొన్ని నెలలుగా యుద్ధం కారణంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ చమురు మార్కెట్లలో సంక్షోభం తెలిసిందే. అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడ్డప్పటికీ పూర్తి స్థాయిలో హర్మూజ్ సాధారణ స్థితికి చేరుకోలేదు. దీన్ని గుర్తించిన మన దేశం ఇంధన భద్రతను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది . గల్ఫ్ ప్రాంతంలో సరఫరా అంతరాయాల నేపథ్యంలో భారత రిఫైనరీలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. మన దేశం జూన్ నెలలో రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లను గణనీయంగా పెంచినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి.
ఉక్రెయిన్‌తో యుద్దం తర్వాత పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా రష్యా తన చమురును డిస్కౌంట్‌లో విక్రయిస్తోంది. భారత్ ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంది.. మధ్యంలో కొంత కాలం తగ్గించిన్పటికీ జూన్ 1 నుంచి 19 వరకు రోజుకు సగటున 26.6 లక్షల బ్యారెళ్ల క్రూడ్‌ఆయిల్ రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం. రష్యా మన దేశానికి మళ్లీ అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలిచింది. సౌదీ అరేబియా రోజుకు 3.84 లక్షల బ్యారెళ్ల చమురును భారత్‌కు ఎగుమతి చేసుకుంటున్నాం. యూఏఈ నుంచి కూడా రోజుకు 6.36 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి అవుతోంది. ఇక వెనిజువెలా నుంచి రోజుకు 2.09 లక్షల బ్యారెళ్ల ముడి చమురు దిగుమతి మొదలైంది. కాగా అమెరికా నుంచి మాత్రం చమురు కొనుగోళ్లను తగ్గించాం. మే నెలలో అమెరికా నుంచి రోజుకు 2.52 లక్షల బ్యారెళ్ల చొప్పున ముడి చమురు దిగుమతి చేసుకోగా జూన్ నెలలో ఇది 91 వేల బ్యారెళ్లకు పడిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా భారత్ మూడో అతిపెద్ద ఇంధన దిగుమతిదారుగా ఉంది. దేశీయ అవసరాల కోసం ముడి చమురు 88 %, సహజ వాయువు 50 %, ఎల్పీజీ 65 % వరకు దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. హర్మూజ్ సంక్షోభానికి ముందు చూస్తే గల్ఫ్ దేశాల నుంచే భారత్‌కు సగం వరకు చమురు, మూడింటి రెండొంతుల మేర ఎల్ఎన్‌జీ, దాదాపు 90 % ఎల్పీజీ సరఫరా అయ్యేది. గల్ఫ్ ప్రాంతంలో ఏ చిన్న ఉద్రిక్తతలు నెలకొన్నా భారత్‌పై భారీగా ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో భారత్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. వంటగ్యాస్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా గల్ఫ్ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ దిగుమతులను భారీగా వైవిధ్యీకరించింది. అమెరికా, ఇరాన్ వంటి దేశాల నుంచి దిగుమతులను ముమ్మరం చేసింది. అదే సమయంలో, అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా సామాన్యుడిపై భారం పడకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఆ నష్టాన్ని తామే భరించాయి.
పశ్చిమాసియా యుద్ధ వాతావరణం నెలకొనడంతో, సరఫరా దెబ్బతినకుండా ఉండేందుకు భారత్ తన దిగుమతుల వ్యూహాన్ని మార్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా నుంచి భారత్ కేవలం 8 % ఎల్‌పీజీని దిగుమతి చేసుకోగా, ఏప్రిల్ నాటికి అది సుమారు 33 %కి పెరిగింది. 2025 చివరలో అమెరికాతో కుదుర్చుకున్న 2.2 మిలియన్ టన్నుల సరఫరా ఒప్పందం ఈ క్లిష్ట సమయంలో భారత్‌కు ఎంతగానో అండగా నిలిచింది. అర్జెంటీనా, చిలీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి సుదూర దేశాల నుంచి కూడా భారత్ ఎల్‌పీజీని సేకరించింది. మరోవైపు పరిమిత లభ్యత కారణంగా భారత్‌లో ఎల్‌పీజీ వినియోగం కూడా తగ్గింది. ఫిబ్రవరిలో 3.2 మిలియన్ టన్నులుగా ఉన్న వినియోగం, ఏప్రిల్‌లో 2.47 మిలియన్ టన్నులకు పడిపోయింది. ముఖ్యంగా మార్కెట్ ధరలతో ముడిపడి ఉన్న కమర్షియల్, ఇండస్ట్రియల్ వినియోగదారులు ధరల భారం భరించలేక వాడకాన్ని తగ్గించుకున్నారు.
అంతర్జాతీయంగా 46 % ధరలు పెరిగినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగదారులపై ఆ భారాన్ని పడనీయలేదు. ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర కేవలం 10 % మాత్రమే పెరిగింది. దీనివల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలపై తీవ్ర ఆర్థిక భారం పడింది. ఒక్క మే నెలలోనే దిల్లీలో ప్రతి డొమెస్టిక్ సిలిండర్‌పై చమురు సంస్థలకు 651 రూపాయల నష్టం వాటిల్లింది. మార్చి నుంచి మే వరకు కేవలం మూడు నెలల కాలంలోనే ఈ సంస్థలు దాదాపు 22 వేల కోట్ల మేర నష్టాలను భరించాల్సి వచ్చింది.పశ్చిమాసియాలో సంక్షోభం మన దేశానికి ఒక పెద్ద పాఠం నేర్పింది. భవిష్యత్తులో ఇలాంటి భౌగోళిక రాజకీయ ఆటంకాలు ఎదురైనా తట్టుకునేలా దిగుమతులను ఒకే ప్రాంతం నుంచి మరిన్ని దేశాలకు విస్తరించుకోవడం, దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవడం ఎంత కీలకమో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.




