Burning Topic: ప్రపంచానికి బిగ్ ట్విస్ట్.. అమెరికా భారత్ మధ్య కీలక ఒప్పందం

Burning Topic: భారత్ మరియు అమెరికా మధ్య వాషింగ్టన్ డీసీలో కీలక వాణిజ్య ఒప్పందం. 2030 నాటికి 500 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 22 April 2026 6:31 AM IST
Burning Topic
X

Burning Topic: ప్రపంచానికి బిగ్ ట్విస్ట్.. అమెరికా భారత్ మధ్య కీలక ఒప్పందం

Burning Topic: కొద్ది రోజులుగా కొనసాగుతున్న అంతర్జాతీయ పరిణామాలు, భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో భారత్‌-అమెరికా సంబంధాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. గతేడాది డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుని వచ్చిన తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాలపై సుంకాలను ఎడా పెడా విధించారు. ఈ క్రమంలో భారత్ మీద 25 % సుంకాలతో పాటు, రష్యా నుంచి చమురు కొంటున్నందుకు విధించిన 25 % అదనపు సుంకాలు కలిపి విధించిన 50 % సుంకాలు విధించారు.

దీంతో భారత్, అమెరికాలో మధ్య వాణిజ్య ఒప్పందం కోసం జరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభన మొదలైంది. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ట్రంప్‌ ఫోన్‌ మరీ ఈ విషయం ప్రకటించారు. ప్రతీకార సుంకాలనూ తగ్గిస్తున్నామని వెల్లడించారు. ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య దూరాన్ని తగ్గించింది. అమెరికా విధించిన సుంకాలు తగ్గించేందుకు అవకాశం ఏర్పడింది.

భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం కొలిక్కి రావడంలో యూరోపియన్ యూనియన్‌తో మన దేశానికి కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా ఓ కారణమైంది. ప్రపంచంలో భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగా.. యూరోపియన్ యూనియర్ 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఈ రెండూ ప్రపంచ స్థూల దేశీయ ఉత్పత్తిలో 25 % వాటాను కలిగి ఉంటాయి.

ఈ ఒప్పందం ఇటు భారత్‌కు, అటు యూరోపియన్ దేశాలకు ఎంతో లాభదాయకం. ఈ ఒప్పందం అమెరికాకు ఏమాత్రం మింగుడు పడలేదు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై తాము సుంకాలు విధిస్తే, యూరోపియన్లు మాత్రం భారత్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని అగ్రరాజ్యం విమర్శించింది. ఈయూ ఉక్రెయిన్ ప్రజలకు మద్దతు ఇవ్వడం కంటే వాణిజ్య ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిందని ఆగ్రహించింది. అయితే భారత్ మార్కెట్ చేజారుతుందని గ్రహించిన అమెరికా చివరకూ మనతో డీల్‌కు అంగీకరించక తప్పలేదు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story