Burning Topic: చుక్కలు చూస్తున్న పాకిస్తాన్
Burning Topic: కెనడా వేదికగా పాకిస్తాన్‌కు భారత్ తీవ్ర పరాభవం. సింధు జలాల ఒప్పందం, ఉగ్రవాదంపై గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్. ఉగ్రవాదాన్ని అంతం చేస్తేనే చర్చలని తెగేసి చెప్పిన కేంద్రం.
Burning Topic: చుక్కలు చూస్తున్న పాకిస్తాన్
Burning Topic: ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ వేదికపై మరోసారి పరాభవం ఎదురైంది. కశ్మీర్ అంశంతో పాటు సింధు జలాల ఒప్పందం వివాదంలో జోక్యం చేసుకోవాలంటూ కెనడాను కోరిన పాకిస్తాన్ ప్రయత్నాలు దారుణంగా విఫలమయ్యాయి.
రక్తం-నీరు కలిసి ప్రవహించలేవని పదే పదే చెబుతున్నా భారత్.. పాక్‌కు మరోసారి చురక అంటించింది. భవిష్యత్తులో నదీ జలాల పంపిణీపై చర్చలు జరగాలన్నా.. ఒప్పందం పునరుద్ధరణ కావాలన్నా పాకిస్థాన్ ముందుగా సరిహద్దు ఉగ్రవాదాన్ని శాశ్వతంగా అంతం చేయాలని భారత్ షరతు విధించింది.
దేశ సార్వభౌమాధికారానికి, భద్రతకు ముప్పు వాటిల్లితే ఈ ఒప్పందం నుంచి పూర్తిగా వైదొలగడానికి కూడా వెనుకాడబోమని తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చింది.
Next Story




