Burning Topic: వందేళ్ల ప్రస్థానం.. శూన్యంలో కమ్యూనిజం: ఐదు దశాబ్దాల తర్వాత అధికారం లేని 'లెఫ్ట్'!

Burning Topic: భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వందేళ్లు పూర్తయిన తరుణంలో, దేశంలో వామపక్షాలు దారుణమైన స్థితికి చేరుకున్నాయి.

Arun Chilukuri
Published on: 6 May 2026 12:20 PM IST
Burning Topic:
X

Burning Topic: వందేళ్ల ప్రస్థానం.. శూన్యంలో కమ్యూనిజం: ఐదు దశాబ్దాల తర్వాత అధికారం లేని 'లెఫ్ట్'!

Burning Topic: మన దేశంలో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమై వందేళ్లు పూర్తయింది. 2025 డిసెంబరు 26న భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది. బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా, మార్క్సిస్ట్ ఆలోచనలతో, కార్మిక వర్గ పార్టీగా ఇది ఏర్పడింది. రష్యాలోని బోల్షివిక్ విప్లవ స్ఫూర్తితో ప్రారంభమైన కమ్యూనిస్టు పార్టీ, వలసవాద వ్యతిరేక పోరాటాల్లో కీలక పాత్ర పోషించింది. అయితే నిషేధాలు, అణచివేత ధోరణి వల్ల కమ్యూనిస్టులు అజ్ఞాతంలో పనిచేయాల్సి వచ్చింది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1951–52లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ 16 లోక్‌సభ స్థానాలను గెలుచుకొని పార్లమెంటులో అతిపెద్ద ప్రతిపక్షగా నిలిచింది ఆ తర్వాత 1957లో కేరళలో ఈఎంఎస్​ నంబూద్రిపాద్ నేతృత్వంలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రపంచంలోనే మొదటిసారిగా ప్రజాస్వామ్యయుతంగా బ్యాలట్ ద్వారా ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వం ఇది. తదనంతర కాలంలో కమ్యూనిస్టుల్లో చీలిక వచ్చి.. సీపీఐ, సీపీఎంగా వేరుపడ్డాయి.

1977లో పశ్చిమబెంగాల్లో సీపీఎం అధికారంలోకి వచ్చింది. దాదాపు 34ఏళ్ల పాటు నిరంతరాయంగా రాష్ట్రాన్ని పాలించింది. ముఖ్యమంత్రిగా జ్యోతిబసు 23 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత 2000లో బుద్ధదేవ్‌ భట్టాచార్య బాధ్యతలు చేపట్టారు. మరో 11 ఏళ్ల పాటు అక్కడ వామపక్షాల పాలన సాగింది. కేరళలో అధికారం మారుతూ వచ్చినప్పటికీ, త్రిపురలో మాత్రం వామపక్షాలు సుస్థిర విజయాన్ని అందుకున్నాయి. 1993లో త్రిపురలో 60 స్థానాలకు గాను 44 స్థానాలను గెలుచుకుని క్లీన్‌ స్వీప్‌ చేశాయి. దశరథ్‌ దేబ్‌ 1998 వరకు, ఆపై మాణిక్‌ సర్కార్‌ వరుసగా 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. బెంగాల్‌ తర్వాత, కేరళ, త్రిపురల్లో వామపక్ష కూటమి ఎక్కువకాలం అధికారంలో కొనసాగింది. మన దేశంలోని కమ్యూనిస్టులు బలపడటానికి కారణం కార్మిక వర్గాల్లో, బలమైన ఆదరణ. భూసంస్కరణలు, కార్మికుల హక్కుల, పేదల సమస్యల కోసం పోరాటాలు ప్రధాన పాత్ర పోషించాయి

జ్యోతిబసుకు 1996లో దేశ ప్రధాని పదవి చేపట్టే అవకాశం కూడా వచ్చింది. దానికి జ్యోతిబసు సుముఖత వ్యక్తంచేసినా... సీపీఎం పొలిట్‌బ్యూరో తిరస్కరించింది. ఇదో చారిత్రక తప్పిదమని ఆ తర్వాత విమర్శలు వచ్చాయి. 2008లో అమెరికాతో అణు ఒప్పందానికి వ్యతిరేకంగా మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకోవడంతో.. ఆ ప్రభుత్వం సభలో బల పరీక్షకు వెళాల్సి వచ్చింది. అప్పటికి లెఫ్ట్‌ పార్టీలకు 60 మంది లోక్‌సభ సభ్యులున్నారు. ఆ తర్వాత కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశంలో కమ్యూనిస్టుల ప్రాభవం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే స్థితికి చేరుకుంది.

2011లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష ప్రభుత్వానికి పెద్ద దెబ్బే తగిలింది. మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత త్రిపురలో కూడా కమ్యూనిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ ధాటికి తాకిడికి మాణిక్‌ సర్కార్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది.

ఆ తర్వాత కాలంలో వామపక్షాలకు ఊరటగా నిలిచింది కేరళ మాత్రమే. 2016లో పినరయి విజయన్‌ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన లెఫ్ట్‌ ఫ్రంట్, 2021లో కూడా మళ్లీ గెలిచి కేరళలో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుందనే ఆనవాయితీని తిరగరాసింది. అయితే, తాజా ఎన్నికల్లో వామపక్షాలు దక్షిణాది రాష్ట్రాన్ని కూడా కోల్పోయాయి. కేరళలో దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. అధికారమంతా ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆయన సన్నిహితుల చేతుల్లోనే కేంద్రీకృతమైందన్న విమర్శలు వచ్చాయి. ఆయన అహంకార పూరిత వైఖరి కూడా పార్టీకి నష్టం చేకూర్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.దీంతో శ రాజకీయాల్లో దాదాపు 70 ఏళ్లకుపైగా క్రియాశీల పాత్ర పోషించిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ఒక్క రాష్ట్రంలోనూ అధికారంలో లేకుండా కనుమరుగయ్యాయి.. వామపక్షాలకు ఇలా జరగడం దేశంలో గత 50 ఏళ్లలో ఇదే మొదటిసారి.

కమ్యూనిస్టులు కాలానుగుణంగా మారేందుకు ఇష్టపడరు. ఇవే కమ్యూనిస్టు పార్టీల వైఫల్యానికి కారణమని విమర్శిస్తుంటారు. చైనా, ఇతర కమ్యూనిస్టు దేశాల్లో పాలకులు మార్కెట్ సంస్కరణలు చేపట్టినప్పటికీ, భారత లెఫ్ట్​ పార్టీలు మాత్రం పాత మార్క్సిస్ట్ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నాయి. ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణలను భారత కమ్యూనిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు. అందుకే అభివృద్ధిని ఆకాంక్షించే ఓటర్లకు వారు దూరమవుతున్నారు. మరోవైపు దేశంలో పట్టణీకరణ పెరగడం, యువత వలసలు వెళ్లడం బాగా పెరిగింది. ప్రజల ప్రాధాన్యతలు వర్గ పోరాటాల నుంచి ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, దేశాభివృద్ధి వైపు మళ్లాయి. వీటిని కమ్యూనిస్టులు తమకు అనుకూలంగా మార్చుకోలేకపోయారు. పైగా వ్యతిరేకించారు. ఇది లెఫ్ట్ పార్టీలకు తీరని నష్టం చేకూర్చింది. వీటికి తోడు ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం లెఫ్ట్​ పార్టీల ఓటు బ్యాంకును కొల్లగొట్టింది.

2024 లోక్​సభ ఎన్నికల్లో సీపీఐ 4 సీట్లు, సీపీఐ 2 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగాయి పాత కమ్యూనిస్టు భావజాలం, అంతర్గత విభేదాలు, సవాళ్లు, నాయకత్వ లోపం మొదలైనవి లెఫ్ట్ పార్టీలను వేధిస్తున్న సమస్యలు. పైగా ఇప్పుడు ఉన్న నాయకులు అందరూ వయస్సు రీత్యా చాలా పెద్దవారు. ఆ పార్టీలకు యువనాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు దేశంలో పట్టణీకరణ పెరగడం, యువత వలసలు వెళ్లడం బాగా పెరిగింది. ప్రజల ప్రాధాన్యతలు వర్గ పోరాటాల నుంచి ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, దేశాభివృద్ధి వైపు మళ్లాయి. వీటిని కమ్యూనిస్టులు తమకు అనుకూలంగా మార్చుకోలేకపోయారు. పైగా వ్యతిరేకించారు. ఇది లెఫ్ట్ పార్టీలకు తీరని నష్టం చేకూర్చింది. వీటికి తోడు ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం కూడా లెఫ్ట్​ పార్టీల ఓటు బ్యాంకును కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీలు రాజకీయంగా తమ ఉనికి కాపాడుకుంటాయా? లేదా కాలగర్భంలో కలిసిపోతాయా? అన్నది చూడాలి.



Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story