Burning Topic: విమానాన్ని కూల్చేందుకు కోపైలట్ కుట్ర.. ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన భారత పైలట్!
Burning Topic: ఫ్లై దుబాయ్ విమాన హైజాక్ యత్నాన్ని భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసంతో తిప్పికొట్టారు.
Burning Topic: విమానాన్ని కూల్చేందుకు కోపైలట్ కుట్ర.. ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన భారత పైలట్!
Burning Topic: రెండు దశాబ్దాల క్రితం విమానాలకు హైజాక్‌చేసి న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట టవర్లను ఢీకొట్టి వేలాది మంది మృత్యువును కారణమైన ఘటను ప్రపంచం ఇప్పటికీ మరచిపోలేదు. దాదాపు అలాంటి కుట్రనే పశ్చిమాసియాలో అమలు చేయడానికి ప్రయత్నించారా?. పశ్చిమాసియాలో తాజాగా జరిగిన 'ఫ్లై దుబాయ్' ఘటన అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠతో కూడిన ఆందోళనకు దారి తీసింది. ఓ కోపైలట్ విమానాన్ని తన అదుపులోకి తీసుకుకొని కూల్చే ప్రయత్నం చేయడం, అడ్డుకోబోయిన తోటి పైలట్ మీద కత్తితో దాడి చేయడం, అప్రమత్తమైన ప్రయాణీకులు కుట్రదారుని అడ్డుకోవడం, అదే విమానంలో ఉన్న ఆఫ్ డ్యూటీ పైలట్లు రంగ ప్రవేశం చేసి చాక చక్యంగా సుక్షితంగా ల్యాండ్ చేయడం కలకలం రేపాయి. తీవ్ర భయాందోళనలకు గురైన ప్రయాణీకులు చివరకు కథ సుఖాంతం కావడంతో ఊపరి పీల్చు కున్నారు. ఈ వ్యవహారంతో కీలకంగా మారిన భారతీయ కెప్టెన్ అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంటున్నారు. ఇంతకీ ఫ్లై దుబాయ్‌లో ఏం జరిగింది.
ఫ్లై దుబాయ్ సంస్థకు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ రకం ఎఫ్‌జడ్ -1073 విమానం బుధవారం ఉదయం 6.05 గంటలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్ సమీప బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరింది. ఆ విమానంలో మొత్తం 174 మంది ప్రయాణీకులు ఉండగా వీరిలో 27 మంది చిన్నారులు.. విమానం దాదాపు రెండు గంటల ప్రయాణం తర్వాత విమానం జోర్డాన్ గగనతలానికి చేరుకుంది. ఉదయం 8.31 గంటలకు విమానం 34,000 అడుగుల ఎత్తులో వెళ్తోంది. అదే సమయంలో కోపైలట్ విమానాన్ని తన అధీనంలోకి తీసుకుని కుప్పకూల్చేందుకు ప్రయత్నించాడు. విమానం హఠాత్తుగా 30 సెకన్లలోనే 20వేల అడుగుల కిందకు జారిపోయింది. అప్రమత్తమైన కెప్టెన్ వెంటనే అడ్డుకున్నాడు. ఈ క్రమంలో విమానం గుండ్రంగా తిరిగి 5,000 అడుగులుపైకి, మళ్లీ 7,000 అడుగులు కిందకు జారింది. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేశారు.
విమానం కాక్‌పిట్‌లో తనను అడ్డుకున్న కెప్టెన్‌ను కోపైలట్ కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. వెంటనే కెప్టెన్ ‘విమానం పడిపోతోంది.. ఎవరైనా వచ్చి సాయంచేయండి’’ అంటూ అరుపులు మొదలు పెట్టారు. వెంటనే అప్రమత్రమైన కొందరు ప్రమాణీకులు, విమాన సిబ్బంది వెంటనే కాక్‌పిట్‌లోకి పరుగెత్తారు. కత్తి చేత పట్టుకొని విమానంలోని వ్యవస్థలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్న కోపైలట్‌ను ధైర్యంగా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అదే విమానంలో ప్రయాణం చేస్తున్న యూరప్, బ్రిటన్‌కు చెందిన ఇద్దరు పైలట్లు సమయస్ఫూర్తితో కాక్‌పిట్‌లోకి వచ్చి విమానాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఇదంతా జరిగేలోపే రక్తమోడుతున్న కెప్టెన్ ఎమర్జెన్సీకి సంబంధించిన సిగ్నల్స్ ఇవ్వడంతో ఇజ్రాయెల్ వైమానికి దళం అప్రమత్తమైంది. వెంటనే తన అత్యాధునిక ఫైటర్‌జెట్‌లను తోడుగా పంపింది. ఈ పరిణామాలు ప్రయాణీకులకు ధైర్యం తప్పించాయి. ఆనందంతో విమానంలో కేరింతలు కొడుతూ సాహసవంతులను అభినందించారు.
మొత్తానికి ఆఫ్ డ్యూటీ పైలట్లు విమానాన్ని 9.45 గంటలకు సౌదీ అరేబియాలోని తబుక్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. వెంటనే విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన కో-పైలట్ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఒమన్ దేశానికి చెందిన వాడని తెలిసింది. అయితే భద్రతా కారణాలతో అతని పేరును అధికారులు వెల్లడించలేదు. కాగా ఈ విమానం నడుపుతున్న భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ కత్తి పోట్లకు గురైనా ఏమాత్రం వెనకడుగు వేయలేదు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అసాధారణ ధైర్యసాహసాలను ప్రదర్శించి, చాకచక్యంగా కాక్‌పిట్ తలుపు తెరిచాడు. అప్పటికే అందరినీ అప్రమత్తం చేయడంతో విమానంలోని 174 మంది ప్రయాణికుల ప్రాణాలను రక్షించగలిగాడు తీవ్రంగా గాయపడిన స్మిత్ మచ్చర్ ప్రస్తుతం సౌదీ అరేబియాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
కోపైలట్‌తో వీరోచితంగా పోరాడి అందర్నీ కాపాడిన పైలట్ స్మిత్ మచ్ఛార్‌పై అభినందనల వర్షం కురిసింది. ఈయన గతంలో స్పైస్‌జెట్‌లో పనిచేశారు. తర్వాత 2022లో ఫ్లైదుబాయ్ సంస్థలో చేరారు. ఈయనకు పైలట్‌గా 13 ఏళ్ల అనుభవం ఉంది. ఏకంగా 9,750 గంటలకుపైగా విమానం నడిపారు. విమానసిబ్బంది వనరుల నిర్వహణలో, విమాన ప్రమాణాలు, నిబంధనలను పాటించడంలో, బోయింగ్ 737 రకం విమానాలను నడపడంలో నిష్ణాతుడు.దుబాయ్-ఇజ్రాయెల్ విమానంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. విమానం వేగంగా కిందకు పడిపోతున్న దృశ్యాలను భయపడుతూనే అందులోని ప్రయాణికులు తమ ఫోన్లలో బంధించారు. ‘‘చచ్చిపోతాననుకున్నా. విమానం ఇష్టమొచ్చినట్లు గాల్లో గింగిరాలు తిరిగింది. బతుకుతాననుకోలేదు’’అని ఒక ప్రయాణికురాలు ఏడుస్తూ చెప్పింది. విమానం దిగగానే ప్రయాణీకులు తమ అనుభవాలను పంచుకున్నారు.
పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రాణాంతక దాడి జరిగినా.. తన గురించి ఆలోచించకుండా ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేశారు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. అనుకోకుండా ప్రమాదం ఎదురైన సమయంలో, తీవ్రంగా గాయపడినప్పటికీ వందలాది మంది ప్రాణాలను కాపాడారు అంటూ ఆయనను ‘హీరో’గా అభివర్ణించారు. దేశం మొత్తం స్మిత్‌ను చూసి గర్విస్తోందని అంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయన వేగంగా కోలుకుని మరింత సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను’’ అని తెలిపారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్ దేశానికి గర్వకారణమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఆయన ధైర్యం, అద్భుతమైన సమయస్ఫూర్తి ఎంతగానో కదిలించాయన్నారు. తీవ్రంగా గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను కాపాడాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని ప్రశంసించారు. ఆయన ధైర్యం ఒక పెద్ద విషాదాన్ని నివారించిందని కొనియాడారు. మచ్చర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అభినందనలు. ఆయన ప్రదర్శించిన ధైర్యం అసాధారణం. కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడినప్పటికీ పోరాడి, కాక్‌పిట్ తలుపు తెరిచారు. ప్రయాణికులు, సిబ్బంది ఆ దుండగుడిని నిలువరించేలా మార్గం సుగమం చేశారు. విమానంలో ఉన్న ఇజ్రాయెల్ పౌరులతో సహా మొత్తం 174 మంది ప్రాణాలను ఆయన కాపాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన నిజమైన హీరో' అని ప్రశంసించారు. మరోవైపు ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన కాక్‌పిట్ దాడి ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. విమాన కెప్టెన్, భారతీయ పౌరుడైన స్మిత్ మచ్చర్ ఒక "రియల్ హీరో" అంటూ అభివర్ణించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో తాను ఈ విషయంపై సుదీర్ఘంగా మాట్లాడినట్లు వైట్‌హౌస్‌లో విలేకరులకు ట్రంప్ తెలిపారు.
కాగా ఈ ఘటనలో యానివ్ హయూన్ అనే ప్రయాణీకుని సమయస్ఫూర్తి ఎంతోమంది ప్రాణాలు కాపాడగలిగింది. విమానాలు నడపడంలో ఏమాత్రం అనుభవం లేని ఈ వ్యక్తి అత్యవసర సమయంలో స్పందించేందుకు గతంలో చూసిన ఓ టీవీ షో ఉపయోగపడిందని తెలిపారు. కాక్‌పిట్‌లో ఘర్షణ జరుగుతున్న సమయంలో యానివ్ హయూన్ అనే ప్రయాణికుడు ధైర్యంగా లోపలికి వెళ్లి అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన చొక్కాకు రక్తపు మరకలు అంటిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రయాణికులు సురక్షితంగా ఇజ్రాయెల్ చేరుకున్న తర్వాత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యానివ్‌ను కలిశారు. ‘చాలా గొప్ప పని చేశావ్. నువ్వు హీరో’ అంటూ అభినందించారు. తాను ఓ ఫ్లంబర్‌ను అని ఎయిర్‌క్రాష్ ఇన్వెస్టిగేషన్ టీవీ షో గుర్తుకు వచ్చి కంట్రోల్ స్టిక్స్‌ను వెనక్కి లాగాను. ఆ వెంటనే ఆఫ్‌డ్యూటీలో ఉన్న పైలట్ విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకున్నారు అంటూ యానివ్ తెలిపారు.




