Burning Topic: పాకిస్థాన్ కు చుక్కలు చూపిస్తున్న మోదీ.. నీళ్లు లేక అల్లాడుతున్న పాకిస్తాన్
Burning Topic: సింధూ జలాల ఒప్పందంపై భారత్ దూకుడుతో పాకిస్థాన్‌లో తీవ్ర నీటి సంక్షోభం నెలకొంది.
Burning Topic: పాకిస్థాన్ కు చుక్కలు చూపిస్తున్న మోదీ.. నీళ్లు లేక అల్లాడుతున్న పాకిస్తాన్
Burning Topic: భారత్ సింధూ జలాల పంపిణీ ఒప్పంద నిలిపేయడంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది పాకిస్థాన్. ఇప్పటికే ఆ దేశంలో కరువు ఛాయలు మొదలయ్యాయి. దీంతో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఐక్యరాజ్య సమితిలో మొరపెట్టకుంది. అయితే ఆ ఒప్పందానికి కాలం చెల్లిందని, ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే పాకిస్థాన్‌కు సింధూ జలాల మీద ఎలాంటి హక్కు లేదని భారత్ స్పష్టం చేసింది. దీంతో నీటి కోసం యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నామని బెదిరింపులకు దిగుతోంది పొరుగు దేశం. అయితే భారత్ పట్టించుకోకపోవడంతో సింధూ నాగరికతకు అసలైన వారసులం తామే అంటూ కొత్త చరిత్ర పాఠాలను వినిపిస్తోంది.
సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం పాకిస్థాన్‌ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. ముఖ్యంగా సింధ్, బలూచిస్థాన్ ప్రావిన్స్‌లలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే సుక్కూర్ బ్యారేజ్ పరిధిలో నీటి మట్టాలు ప్రమాదకరంగా పడిపోయింది. పాకిస్థాన్‌లోనే అతిపెద్ద నీటిపారుదల వ్యవస్థల్లో ఒకటైన ఈ బ్యారేజ్‌పై కోట్లాది మంది జీవనాధారం ఆధారపడి ఉంది.
కాలువల్లో నీటి లభ్యత గణనీయంగా తగ్గిపోవడంతో అక్కడి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సాగు పనులు ప్రారంభించలేక చేతులెత్తేస్తున్నారు. ఇక నీటి కొరత పాకిస్థాన్‌లోని ప్రావిన్స్‌ల మధ్య ఉద్రిక్తలకు కారణమవుతోంది. తమకు రావాల్సిన నీటిని పంజాబ్ అక్రమంగా వినియోగిస్తోందని సింధ్ ఆరోపిస్తోంది. దిగువ ప్రాంతమైన సింధ్‌కు మాత్రం తగినంత నీటిని విడుదల చేయడం లేదని అక్కడి నేతలు మండిపడుతున్నారు.
సింధూ నదీ జలాలకు సంబంధించి 1960లో కుదిరిన పాకిస్థాన్‌లో కుదిరిన ఒప్పందాన్ని భారత్ ఇటీవల నిలిపివేసిన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. 2025 ఏప్రిల్‌లో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించిన అనంతరం భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ ప్రోత్సహిత సరిహద్దు ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించే వరకు సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణ ఉండదని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.
ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం సింధు నదీ పరివాహక ప్రాంతంలోని సుమారు 80 శాతం నీటి వినియోగ హక్కులు పాకిస్థాన్‌కు ఉన్నాయి. వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ నదీ వ్యవస్థ అత్యంత కీలకంగా మారింది. నీటి ప్రవాహంలో అంతరాయం కలిగితే లక్షలాది మంది జీవనాధారాలు దెబ్బతింటాయని పాకిస్థాన్ ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది.
పాకిస్థాన్‌లో ప్రస్తుతం తీవ్ర నీటి కొరత నెలకొంది. ముఖ్యంగా సింధ్, బలూచిస్థాన్ ప్రాంతాల్లో దాదాపు మూడో వంతు జనాభా నీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. సింధ్ సాగునీటి శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, నార్త్ వెస్ట్ కాలువలో 64.1 శాతం నీటి లోటు ఉంది. రైస్ కాలువలో 38 శాతం, దాదు కాలువలో 82 శాతం వరకు నీటి కొరత నమోదైంది. సుక్కూర్ బ్యారేజీలో నీటిమట్టాలు నిరంతరం తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
అంతర్గత నీటి పంపిణీ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమవుతోందని, దీని వల్ల వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటోందని స్థానిక నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సింధు జలాల ఒప్పంద ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి జోక్యం చేసుకోవాలని పాకిస్థాన్ కోరింది చెనాబ్ నది జలాలను మళ్లించేలా చేపట్టిన ప్రాజెక్టు అంతర్జాతీయ బాధ్యతలకు విరుద్ధమని పాకిస్థాన్ ఆరోపించింది.
అయితే పాకిస్థాన్ వాదనలను భారత్ తిప్పికొట్టింది. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశానికి స్నేహపూర్వక సంబంధాల ప్రాతిపదికన కుదిరిన ఒప్పందాల ద్వారా ప్రయోజనాలను పొందడానికి అర్హత లేదని స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందంపై తమ వైఖరి అత్యంత స్పష్టంగా ఉందని భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ అనుపమ సింగ్ సమితి వేదికపై తెలిపారు.
అంతర్జాతీయ వేదికలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలనే పాక్ ప్రయత్నాలను ఆమె ఎండగట్టారు. . ఒకవైపు ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానంగా మార్చుకున్న పాకిస్థాన్, అంతర్జాతీయ సహకార ఫలాలను, డిమాండ్ చేయడం ఆ దేశ అవివేకానికి నిదర్శనమన్నారు. 1960లో కుదిరిన ఈ ఒప్పందం ప్రస్తుత పరిస్థితులకు, మారుతున్న ప్రపంచ పరిణామాలకు ఎంతమాత్రం సరిపోదని చెప్పారు. కాలం మారిందని, అలాగే ఒప్పందం కూడా మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
2028 జూన్ నాటికి పాకిస్థాన్‌కు సింధు నదీ జలాలను పూర్తిగా నిలిపివేయవచ్చని భారత జలశక్తి మంత్రి సీఆర్ పటిల్ చెప్పినట్లు వచ్చిన వచ్చిన వార్తలు పాకిస్థాన్‌ను ఆందోళనకు గురి చేశాయి. దీంతో భారత్‌ను బెదిరించే ప్రయత్నాలు చేస్తోంది పాకిస్థాన్. తమ నీటి భద్రతకు ముప్పు వాటిల్లిందని భావిస్తే భారత్‌పై యుద్ధానికి కూడా వెనుకాడబోమని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు.
నీటి అంశం తమ దేశ జాతీయ భద్రతలో కీలక భాగమని పేర్కొన్నారు. గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా ఇలాగే పిచ్చి కూతలు కూశారు. భారత్ సింధూ నదిపై ఆనకట్టను నిర్మిస్తే దాన్ని పది క్షిపణులతో నాశనం చేస్తామని హెచ్చరించారు. సింధూ నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదని అన్నారు. తమది ఒక అణ్వస్త్ర దేశమని, తాము పతనమవుతామని అనిపిస్తే తమతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని బెదిరించారు మునీర్.
మరోవైపు సింధూనదీ జలాల కోసం చరిత్రను కూడా వాడుకునే ప్రయత్నం చేస్తోంది పాకిస్థాన్. క్రీ.శ. 712లో ముహమ్మద్ బిన్ ఖాసిం జరిపిన సింధ్ విజయంతోనే తమ చరిత్ర మొదలైందని ఏళ్ల తరబడి విద్యార్థులకు బోధించిన పొరుగు దేశం, ఇప్పుడు సింధు లోయ నాగరికతను ముందుకు తెస్తోంది. మొహెంజోదారో, హరప్పా, తక్షశిల, గాంధార వంటి ప్రాచీన వారసత్వ కేంద్రాలను ప్రచారం చేస్తోంది.
ఈ ప్రాంతాలు తమ దేశంలో ఉన్నందున సింధూ నాగరికతనకు తామే నిజమైన వారసులమని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు బిలావల్ భుట్టో జర్దారీ గొప్పగా చెప్పుకుంటున్నారు. సింధూ నదిపై పాకిస్తాన్‌కు చారిత్రక హక్కు ఉందని అంటున్నారు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఎన్నడూ లేని విధంగా సింధూ నాగరికత ప్రాంతాలకు ప్రాముఖ్యత ఇస్తోంది. మొహెంజోదారోలో కొత్త తవ్వకాలను చేపట్టింది. తక్షశిల, గాంధార, మెహర్‌గఢ్ వంటి ప్రాచీన ప్రదేశాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తోంది.




