Big Debate: ప్రశ్నిస్తే జైలుకా? యువతపై అణచివేతపై విరుచుకుపడ్డ కాంగ్రెస్!
Big Debate: దేశంలో బిజెపి గ్రాఫ్ పడిపోతోందా? ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు, ఓట్ షేర్ తగ్గింపు మరియు జెన్ జీ (Gen Z) యువత డిమాండ్లపై హెచ్‌ఎమ్‌టీవీ బిగ్ డిబేట్‌లో ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ నుమాన్ సంచలన విశ్లేషణ.
Big Debate: ప్రశ్నిస్తే జైలుకా? యువతపై అణచివేతపై విరుచుకుపడ్డ కాంగ్రెస్!
Big Debate: దేశంలో భారతీయ జనతా పార్టీ (BJP) ప్రజాదరణ వేగంగా పడిపోతోందని, ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల ఉపఎన్నికల ఫలితాలే ఇందుకు స్పష్టమైన ఆధారమని ఏఐసీసీ (AICC) నేషనల్ కోఆర్డినేటర్ నుమాన్ మహమ్మద్ పేర్కొన్నారు. హెచ్‌ఎమ్‌టీవీ (hmtv) నిర్వహించిన ‘బిగ్ డిబేట్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఉపఎన్నికల ట్రెండ్స్, జెన్ జీ (Gen Z) యువత ఆలోచనా ధోరణి మరియు కాంగ్రెస్ వ్యూహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉపఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ... బీహార్‌లోని బంకీపూర్ నియోజకవర్గంలో 2025లో బీజేపీ సాధించిన 63% కంటే ఎక్కువ ఓట్ షేర్, ఇటీవల నాటికి కేవలం 34% కి పడిపోయిందని ఆయన గుర్తుచేశారు. అలాగే గుజరాత్‌లో గతంలో లక్ష ఓట్ల భారీ మెజారిటీ సాధించిన స్థానంలో, ఇప్పుడు ఆ మెజారిటీ 30 వేలకు తగ్గిపోవడం బిజెపి పతనానికి సంకేతమని అభిప్రాయపడ్డారు.




