Burning Topic: భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఆర్మీ సీరియస్!
Burning Topic: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లోని సఫిలా, లాంగ్జు ప్రాంతాల్లో భారత్-చైనా బలగాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై స్పందించిన ఐటీబీపీ డీజీ శత్రుజీత్ సింగ్ కపూర్.
Burning Topic: భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఆర్మీ సీరియస్!
Burning Topic: డ్రాగన్ కపట బుద్దికి ఎప్పటికీ నమ్మలేం.. భారత భూభాగాలపై కన్నేసిన చైనా ఇప్పటికే కొన్నిటిని ఆక్రమించి దశాబ్దాలుగా తిష్టేసుకు కూర్చుంది. సరిహద్దుల్లో నిరంతరం కవ్విస్తూ మన దేశంతో ఘర్షణ వైఖరిని కొనసాగిస్తోంది. తూర్పు లడఖ్ వివాదం సద్దుమణుగుతున్నట్లు కనిపిస్తున్న తరుణంలో, చైనా ఇప్పుడు తన వ్యూహాత్మక దృష్టిని అరుణాచల్ ప్రదేశ్ వైపు మళ్లించిందనే వార్తలు వస్తున్నాయి.
అక్కడి సఫిలా, లాంగ్జు సరిహద్దు ప్రాంతాల్లో భారత, చైనా సైనికుల గస్తీ బృందాలు తరచూ ఎదురుపడుతున్నాయి.. తాజాగా ఇరు దేశాల దళాలు ముఖాముఖి ఎదురుపడటంతో సరిహద్దు ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొందనే సమాచారం రావడంతో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయని వార్తలు వచ్చాయి. రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇండోటిబెటిన్ బార్డర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ శత్రుజిత్ సింగ్ కపూర్ వెల్లడించిన ఓ విషయం దేశం దృష్టిని ఆకర్శించింది.
చైనా సరిహద్దు వెంబడి ఇప్పటికీ ప్రతిష్టంభన ఉందని శత్రుజీత్ కపూర్ తెలిపారు. మరీ ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వద్ద భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయని చెప్పారు. గత కొన్నిరోజులుగా ఇరు దేశాల సైనికుల మధ్య ముఖాముఖి తలపడే పరిస్థితి నెలకొందని తెలిపారు. దీంతో సరిహద్దుల వెంబడి భద్రత, ముందస్తు చర్యలను పటిష్ఠం చేసినట్టు వివరించారు.
‘‘అరుణాచల్ సరిహద్దులోని పలు ప్రాంతాల్లో గత కొన్నిరోజులుగా ఘర్షణలు జరిగాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల సమయంలో ఐటీబీపీకి చెందిన శౌర్య కమాండోలు అసాధారణంగా పనిచేస్తున్నారు’’ అని శత్రుజీత్ పేర్కొన్నారు. గల్వాన్ తరహా ఘర్షణలను మెరుగ్గా ఎదుర్కోవడానికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని సిద్ధం చేశామని, భూగర్భ మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. చైనాతో ఘర్షణలను ధ్రువీకరిస్తూ వెలువడిన తొలి ప్రకటన ఇదే కావడం గమనార్హం.
తక్సింగ్ ప్రాంతంలోని కీలక పాయింట్లకు భారత బలగాలు వెళ్లకుండా చైనా సైన్యం అడ్డుకుంటుందని జులైలో కథనాలు వచ్చాయి. అప్పటి నుంచే ఈ పరిస్థితి ఉందని ఐటీబీపీ డీజీ వెల్లడించినట్లయ్యింది. మన దేశానికి చైనానే అత్యంత క్లిష్టమైన సరిహద్దు అని అని ఐటీబీపీ సిబ్బంది వార్షిక సన్మాన కార్యక్రమంలో కపూర్ తెలిపారు.
గల్వాన్ తరహా ఘర్షణలను మెరుగ్గా ఎదుర్కోవడానికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని సిద్ధం చేశామని, భూగర్భ మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నామని తెలియజేశారు. అరుణాచల్ ప్రదేశ దగ్గర వద్ద చైనా సైన్యంతో ఘర్షణలు జరిగినట్లు ఐటీబీపీ చీఫ్ శత్రుజీత్ సింగ్ వెల్లడించడంపై కాంగ్రెస్ స్పందించింది. ఈ అంశంపై కేంద్రం మౌనాన్ని పాటిస్తోందని విమర్శించింది. ఇలా ఘర్షణలు జరుగుతున్నప్పటికీ చైనాకు మాత్రం రాయితీలను కొనసాగిస్తున్నారని దుయ్యబట్టింది.
కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలను బీజేపీ తప్పు పట్టింది. భారత్-చైనా సరిహద్దులు ఎంతో సుదీర్ఘమైనవి, సరిహద్దుల్లో స్థానికంగా ఉండే సైనిక యూనిట్ల మధ్య అప్పుడప్పుడు ఇటువంటి ఘర్షణలు జరగడం సహజమేనని, పెద్ద ఎత్తున యుద్ధం, ఘర్షణ జరుగుతున్నట్లు కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వం చైనా విషయంలో ఎలాంటి నిశ్శబ్దాన్ని పాటించడం లేదని, సరిహద్దు భద్రత విషయంలో రాజీ పడకుండా సైన్యం పూర్తి అప్రమత్తతతో వ్యవహరిస్తోందని తెలిపింది.
ఐటీబీపీ కొత్తగా ఏర్పాటు చేసిన 'శౌర్య' కమాండో విభాగాలు చైనా పీఎల్ఏ బలగాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయని గుర్తుచేసింది. గతంలో కాంగ్రెస్ హయాంలోనే, ముఖ్యంగా నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో భారత్‌కు చెందిన వేలాది చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని బీజేపీ నేతలు తిప్పికొట్టారు. అబద్ధాలతో రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని తక్సింగ్ సర్కిల్ పరిధిలో ఈ రెండు ప్రాంతాలు ఉన్నాయి. ఎల్ఏసీపై ఇరు దేశాలకు భిన్నమైన అవగాహనలు ఉండటంతో సాధారణ గస్తీ సమయంలో సైనికులు ఎదురుపడటం, స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం సహజం రక్షణ వర్గాలు తెలిపాయి. కాగా ఇరు దేశాల సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలపై క్షేత్రస్థాయి కమాండర్లు సంయమనం పాటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని రక్షణ శాఖ వివరించాయి చైనాతో ఉన్న 3,488 కి.మీ. పొడవైన వాస్తవాధీన రేఖ వెంబడి ఈ ఐటీబీపీ పహారా కాస్తుంటుంది.
ఎత్తయిన ప్రదేశంలో జరిగే ఘర్షణలను ఎదుర్కోవడం శౌర్య కమాండోల ప్రత్యేకత. కాగా చైనా సైన్యం నిబంధనలు అతిక్రమిస్తుండటం వల్లే సరిహద్దుల్లో శాంతి భద్రతలకు భంగం కలుగుతోందని భారత విదేశాంగ శాఖ తెలిసింది. సరిహద్దు వివాదాల పరిష్కారానికి ఇరు దేశాలు దౌత్య, సైనిక మార్గాల్లో చర్చలను కొనసాగిస్తున్నామని రణధీర్ జైస్వాల్ తెలిపారు.
అసఫిలా, లాంగ్జు ప్రాంతాలకు భద్రతాపరంగానే కాకుండా సాంస్కృతిక, మతపరమైన ప్రాధాన్యం కూడా ఉంది. ఇరు దేశాల్లోని బౌద్ధ సమాజాలకు పవిత్రమైన ప్రాంతం. సరిహద్దులో పరిస్థితులు స్థిరంగా ఉంటే భవిష్యత్తులో సరిహద్దు దాటి యాత్రలకు సంబంధించిన అవకాశాలను పరిశీలించవచ్చని రక్షణ వర్గాలు తెలిపాయి.
అయితే, ఇందుకు ఇరు దేశాల అంగీకారం, అనుకూలమైన భద్రతా పరిస్థితులు అవసరమని స్పష్టం చేశాయి. సరిహద్దుల్లో ఎదురెదురుగా సైనికులు తారసపడినప్పుడు పరిస్థితి మరింత తీవ్రం కాకుండా ఇరు దేశాల సైనిక యంత్రాంగాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఫ్లాగ్ మీటింగ్‌లు, హాట్‌లైన్ ద్వారా సమాచార మార్పిడి వంటి వ్యవస్థలను వినియోగిస్తున్నాయి. ఈశాన్య ప్రాంతంలో కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు కూడా ఉన్నతస్థాయి సంప్రదింపులను బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగమని అధికారులు తెలిపారు.
2020లో గల్వాన్ లోయలో తీవ్ర సంఘర్షణ తర్వాత భారత్- చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటినుంచి సుమారు నాలుగేళ్లకు పైగా సైనిక ప్రతిష్టంభన కొనసాగింది. ఇటీవలి కాలంలో ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారించాయి. 2024 అక్టోబరులో తూర్పు లద్దాఖ్‌లోని డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో సైనిక బలగాల ఉపసంహరణకు సంబంధించి ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి.
దీని తర్వాత కొద్ది రోజులకే రష్యాలోని కజాన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2025 ఆగస్టులో మోదీ- చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ వార్షిక సదస్సుకు హాజరయ్యారు. ఆ సమయంలోనే జిన్‌పింగ్‌తో మోదీ మరోసారి విస్తృత చర్చలు జరిపారు. ఇటీవల 2026 సెప్టెంబరులో న్యూదిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా జిన్‌పింగ్ భారత్‌కు వచ్చారు. ఇక్కడ కూడా మోదీ, జిన్‌పింగ్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.




