News Analysis: కూటమి చెక్కుచెదరదు.. స్థానిక పోరులో సీట్ల పంపకంపై జనసేన నేత కృష్ణవేణి కీలక వ్యాఖ్యలు!
News Analysis: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు, సీట్ల కేటాయింపు మరియు కూటమిలో వివాదాలపై హెచ్‌ఎమ్‌టీవీ న్యూస్ ఎనాలసిస్‌లో జనసేన సీనియర్ నాయకురాలు కృష్ణవేణి సుంకర స్పష్టత ఇచ్చారు.
News Analysis: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో విభేదాలు వస్తున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు కృష్ణవేణి సుంకర తీవ్రంగా ఖండించారు. hmtv న్యూస్ ఎనాలసిస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, కూటమి సమైక్యతపై మరియు పవన్ కళ్యాణ్ వ్యూహంపై స్పష్టత ఇచ్చారు.
కూటమిలో ఎలాంటి వీటలు వారలేదని, వచ్చే స్థానిక ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి మరింత బలంగా ప్రజల్లోకి వెళ్తాయని కృష్ణవేణి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో అమలు చేసిన సీట్ల శాతమే స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తించదని, ఏ పార్టీకి ఎక్కడ బలం ఉంటే అక్కడ ఆ పార్టీకి ప్రాధాన్యత లభిస్తుందని వివరించారు. 2019-24 మధ్య పార్టీ కోసం కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు సముచిత స్థానం కల్పించాలనేది పవన్ కళ్యాణ్ ఆశయమని పేర్కొన్నారు.




