Off The Record: చక్రం తిప్పిన రితీష్ రెడ్డి..? సూర్యనారాయణ రెడ్డికి బిగ్ షాక్?
Off The Record: కడప జిల్లా బద్వేల్ టీడీపీలో కీలక పరిణామాలు! రితీష్ రెడ్డిని ఇంచార్జ్ పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారానికి చెక్ పెట్టిన చంద్రబాబు.
Off The Record: చక్రం తిప్పిన రితీష్ రెడ్డి..? సూర్యనారాయణ రెడ్డికి బిగ్ షాక్?
Off The Record: గత కొద్ది రోజుల క్రితం బద్వేలు రాజకీయాల్లో కలకలం రేగింది. ఆ కలకలం కొన్ని నెలలపాటు సాగి ఒక్కసారిగా నిశ్శబ్దం అయింది. బద్వేలు నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉన్న రితీష్ రెడ్డిని వెతిరేకిస్తూ సూర్యనారాయణరెడ్డి వర్గం అధిష్టానం వద్ద తన శక్తియుక్తలన్ని ప్రదర్శించిందట. చివరకు సూర్యనారాయణరెడ్డిని ఇన్ చార్జిగా ప్రకటిస్తున్నారనే పెద్ద ఎత్తున చర్చతోపాటు కొన్ని ఆసక్తికర పరిణామాలు కూడా చోటుచేసుకున్నాయి. అపుడో ఇపుడో ఇన్ చార్జిని ప్రకటిస్తారని రెండు నెలల క్రితం రితీష్ రెడ్డి కటౌట్లు, ఫ్లెక్సీ బ్యానర్లు కూడా తొలగించిన పరిస్ధితి. ఈ క్రమంలో అధిష్టానం వద్ద జరిగిన చర్చ సమయంలో ఓ నేతకు వచ్చిన ఐడియా కారణంగా అది ఆగిపోయినట్లు తెలుస్తుంది. 40 యేళ్లపాటు నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటు వస్తున్న ఆ కుటుంబానికి ప్రతి గ్రామంలో వర్గం ఉందని, ప్రస్తుతం పోటీలో ఉన్న నాయకునికి డబ్బు పరపతి ఉన్నా వర్గం లేదని, భవిష్యత్తులో నియోజకవర్గాన్ని విభజిస్తే దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని.. ఆ పరిస్ధితి రాకుండా చూడాలని పార్టీ అధినేతకు ఓ నేత చెప్పినట్లు సమాచారం. అయితే చాలా మంది జిల్లాతోపాటు రాయలసీమ జిల్లాల్లోని నాయకులు కూడా ఒక్కసారిగా రితీష్ రెడ్డిని తొలగించవద్దని చెప్పినట్లు సమాచారం. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఇన్ చార్జి పదవి మార్పును తాత్కాలికంగానిలిపివేసినట్లు సమాచారం.
ప్రస్తుత బద్వేలు టిడిపి ఇన్ చార్జి రితీష్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మకు నియోజకవర్గం మీద పట్టుతోపాటు ప్రతి గ్రామంలోని కార్యకర్తలతో సత్సంబంధాలున్నాయట. అవి భవిష్యత్తులో పార్టీకి ఎంతో ఉపకరిస్తాయని కొందరు నేతలు చెప్పినట్లు సమాచారం. పునర్విభజనలో బద్వేలు, పోరుమామిళ్ల నియోజకవర్గాలుగా విభజిస్తే.. ఏదో ఒక జనరల్ స్థానం నుంచి విజయమ్మ కాని, రితీష్ రెడ్డి కానీ పోటీ చేస్తే ఆ ప్రభావంతో టిడిపి గెలిచే అవకాశాలున్నాయని చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ సమయంలో ఆ కుటుంబాన్ని ఇబ్బందులు పెడితే భవిష్యత్తులో వారు పార్టీ మారితే ఆ ప్రభావం దాని ద్వారా వచ్చే నష్టం చాలా ఉంటుందని అధిష్టానం వద్ద జరిగిన చర్చల్లో ఒక నేత వ్యక్తం చేశారట. దీన్ని పరిగణనలోకి తీసుకుని పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్ ఇన్ చార్జి మార్పు విషయంలో ఆలోచించి ఆపేశారని విశ్వసనీయ సమాచారం. కాగా రితీష్ రెడ్డి మామ.. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ముఖ్యమంత్రితో మాట్లాడి బద్వేలు విషయంలో కొంత ఆలోచించాలని చెప్పడంతోనే ఇన్ చార్జి పదవి మార్పు ఆగిపోయిందనే చర్చ కూడా జరుగుతోంది.
రానున్న స్థానిక సంస్థలు అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సన్నద్ధంగా ఉండాలని భవించిన విజయమ్మ, రితీష్ రెడ్డి.. ప్రకద్బందీ వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ప్రత్యర్థులను రెచ్చగొట్టకుండా వారిని కలుపుకుపోయే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా ప్రతి గ్రామంలోనూ తనకంటూ ఓ వర్గం, ప్రజల్లో 40 యేళ్లుగా ఉన్న గుర్తింపు, గౌరవాన్ని నిలుపుకోవడంతోపాటు తమ సామర్ధ్యాన్ని నిరుపించుకోవాలనే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారని చెప్పవచ్చు. చూడాలి మరి.. భవిష్యత్తు ఎలా ఉంటుందో.. ఎవరు ఏ పార్టీ తరుపున బరిలో ఉంటారో.




