News Analysis: కాళేశ్వరంపై రాజకీయాలు దురదృష్టకరం.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్!
News Analysis: కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
News Analysis: కాళేశ్వరంపై రాజకీయాలు దురదృష్టకరం.. కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్!
News Analysis: కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఇచ్చిన నివేదికలను పక్కనబెట్టి ప్రభుత్వం రాజకీయ కోణంలో ఆలోచించడం వల్లే ఈరోజు రాష్ట్రంలో రైతులకు సాగునీటి కష్టాలు వచ్చాయని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ మండిపడ్డారు. హెచ్‌ఎంటీవీ డిబేట్‌లో పాల్గొన్న ఆయన, ఈ వివాదంపై సాంకేతిక విశ్లేషణ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టారు.
కేంద్ర పరిధిలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై కాలక్రమేణా మూడుసార్లు స్పష్టమైన నివేదికలు ఇచ్చిందని లక్ష్మీనారాయణ గుర్తు చేశారు.
మొదటి నివేదిక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023 నవంబర్ 1న ఇచ్చారు. డ్యామేజీలను కంట్రోల్ చేయడానికి జియోగ్రాఫికల్, జియోటెక్నికల్ సర్వేలు నిర్వహించి మరమ్మతులు చేయాలని సూచించారు.
రెండవ నివేదిక ప్రభుత్వం మారిన తర్వాత 2024 మే 1న మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు అవసరమైన సాంకేతిక పరీక్షలు నిర్వహించి రిపేర్లు చేపట్టాలని రికమండేషన్స్ ఇచ్చారు.
మూడవ నివేదిక ఈ మధ్య కాలంలోనే మరో నివేదిక కూడా అందజేశారు.




