భాగ్యనగరం రజాకార్ల రాజ్యం కాదు.. సక్సెస్ స్కూల్ వివాదంపై విహెచ్పి ఫైర్!
హైదరాబాద్ సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్లో హిందూ విద్యార్థి చేత కల్మా చదివించిన ఘటనపై విశ్వ హిందూ పరిషత్ (VHP) నేత శశిధర్ తీవ్రంగా మండిపడ్డారు.
భాగ్యనగరం రజాకార్ల రాజ్యం కాదు.. సక్సెస్ స్కూల్ వివాదంపై విహెచ్పి ఫైర్!
సైదాబాద్‌లోని సక్సెస్ స్కూల్లో రెండో తరగతి హిందూ విద్యార్థి డైరీలో కల్మా, సూర ఫాతిహా హోమ్‌వర్క్ రాయడంపై విశ్వ హిందూ పరిషత్ (VHP) ప్రధాన వక్త శశిధర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హెచ్ఎంటీవీ ప్రత్యేక చర్చా వేదికలో పాల్గొన్న ఆయన.. ఈ ఘటనను కేవలం ఒక చిన్న పొరపాటుగా కొట్టిపారేయలేమని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
క్లాసులో ఉన్న 25 మంది విద్యార్థులలో 24 మంది ముస్లింలు, కేవలం ఒకే ఒక్కడు హిందూ విద్యార్థి ఉన్నాడని స్కూల్ యాజమాన్యం చెబుతోందని.. ఆ ఒక్క విద్యార్థిని కూడా మతం మార్చాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పనులు చేస్తున్నారా అని ఆయన నిలదీశారు. విద్యాసంస్థలను మతమార్పిడి కేంద్రాలుగా మార్చుతున్నారని, ఇది ముమ్మాటికీ బాలల హక్కులను కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.




