Jordar Varthalu: కొట్టుకునే దాకా వచ్చిన లీడర్ల మాటలు
Jordar Varthalu: కరీంనగర్‌లో బీఆర్ఎస్ మరియు బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ! మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌పై బీజేపీ దాడి.
Jordar Varthalu: కొట్టుకునే దాకా వచ్చిన లీడర్ల మాటలు
Jordar Varthalu: కరీంనగర్ల ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ మీద కర్రలు, రాడ్లతో దాడి చేసిర్రు పువ్వు పార్టీ కార్యకర్తలు. ఆపీసు ముంగటున్న కారును పొట్టుపొట్టు దంచిర్రు. ఓ దిక్కు పోలీసులు ఆపుతున్నా అస్సల్కే ఆగలేదు వాల్లు. మరెందుకిట్లా అంటే., సెంటర్ మంత్రి బండి సంజయ్ మీద కారు పార్టీ లీడర్లు విమర్షలు జేశిర్రని ఇట్ల జేశిర్రు. మొన్నట్ల కరీంనగర్లున్న బంగారం దుక్నంల దొంగతనం జర్గినప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కేటీఆర్ విమర్షించిన కాడ్నుంచి రొండు పార్టీల నడ్మ అట్టుడికినట్టే అయితున్నది. ఇగియ్యాల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుకుంటా..
ఏ అంశం మీద అయినా మేం చర్చకు సిద్దం మీరు రాండ్రి అని సెంటర్ మంత్రికి సవ్వాల్ ఏశిండు కౌశిక్ రెడ్డి. ఇగట్లనే సెంటర్ హోంమంత్రివి అయ్యిండి కనీసం శాంతిభద్రతల మీద ఏమన్న పట్టిచ్చుకుంటున్నవా అస్సల్కు. వీఐపీలు ఉండే ఏరియాల గింత పెద్ద దొంగతనం జర్గుతే నాలుగు రోజులు గడ్శినా ఆ దొంగలను పట్టుకోలేకపోయిర్రని బగ్గనే గరానికచ్చిండు. ఇగిట్ల మాట్లాడుతుండంగనే పోలీసులచ్చి అరెస్టు జేశిర్రు లీడర్లను. అట్లనే క్యాంపు ఆఫీసు మీద దాడి జేశ్న 13 మంది మీద కేసు రాసిర్రు పోలీసులు. ఇగటు కౌశిక్ రెడ్డి సవ్వాల్ మీద పువ్వు పార్టీ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు గుడ గట్టిగనే గరానికస్తున్నరు. సూడాలె మరి రేపురేపు ఎట్లుంటదనేది.




