Jordar News: నా ఎంగిలి తినండి..
Jordar News: కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన పర్యటనలో చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చకు దారితీసింది.
Jordar News: నా ఎంగిలి తినండి..
Jordar News: ఇగ సూశిర్రానుల్లా.. డీకే సారు కథ ఎట్లున్నదో.. సారు ఆపిల్ పండు తింటె మంచిగనే ఉండుగనీ., ముత్తెమంత కొరికి దాన్ని జనాల్లకు ఇసిరేటాళ్లకు దీని మీద ఇప్పుడు పెద్ద రచ్చనే అయితున్నది. డీకే శివకుమార్ సారు.. తనను ఎమ్మెల్యేగ గెల్పిచ్చిన కనకపుర నియోజకవర్గ పరిధిలున్న హారహళ్లి ఏరియాకు పొయ్యిండు. ముఖ్యమంత్రి అస్తున్నడని అక్కడ జనాలు, అయినె అభిమానులు ఘనంగ స్వాగతం పలికిర్రు. అట్లా వందల కొద్ది యాపిల్ పండ్లు, పూలతోని తయ్యారు జేశ్న భారీ గజమాలను సుతం క్రేన్ సాయంతోని అయినె మెడలేశే ప్రయత్నం జేశిర్రు.
దీంతోని డీకే శివకుమార్ సారు ఆ హారం నుంచి యాపిల్ పండును తీసి తుడ్సుకోని ముత్తెమంత కొరికి మిగిల్న పండును జనాల్లకు ఇసిరిండు. అట్లా ఒక్కటిగాదు, రొండు పండ్లను జనాల్లకు ఇసిరిండు. ఇగా పండ్లు అందుకున్నోళ్లు కొందరు సంబురపడ్డరు. డీకే సారు అభిమానులతోని సరదాగ గడుపుతడుగావట్టి., అట్ల జేశిండని అంటుంటే., ఇంకొందరు మాత్రం మస్తు కోపానికస్తున్నరు. డీకేశివకుమార్ ఏమన్న దేవుడు అనుకుంటున్నడా.. ఎంగిలి జేశ్న ఆపిల్ పండ్లను జనాల మీదికి ఇసురుడేం పద్దతి. అయినేమన్న రాజా.. అక్కడున్నోళ్లు ఏమన్న బంట్లా.. అయినె ఎంగిలి జేశ్న పండ్లను తినడానికి అని కోపానికస్తున్నరు.
ముఖ్యమంత్రి పదవిలకు ఎక్కి నెల రోజులు గుడ గడ్వకముందే కండ్లు నెత్తికెక్కినయా ఎట్ల. ప్రజా జీవితంల ఉన్నప్పుడు పద్దతిగ ఉండాలెగనీ., పెంపుడు జంతువులకేశినట్టు జనాల మీదికి ఎంగిలి ముక్కలు ఇసురుడు మాత్రం అస్సల్కే క్షమించరానిదని కామెంట్లతోని గట్టిగనే అర్సుకుంటున్నరు సోషల్ మీడియాల. అవ్ మరి ప్రజాజీవితంల ఉన్నోళ్లు ఏ పన్జేశ్నా అన్నింటిని నిశితంగ పరిశీలన జేశేటోల్లు ఉంటరుగావట్టి., లీడర్లు సుతం శానా జాగ్రత్తగ ఉండాలే. ఏమంటరుల్లా.




