Jordar Varthalu: నన్ను స్తంభానికి కట్టేసి కొట్టండి!

Jordar Varthalu: తెలంగాణ రాజకీయాల్లో కవితమ్మ వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 May 2026 7:49 AM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: నన్ను స్తంభానికి కట్టేసి కొట్టండి!

Jordar Varthalu: ఇన్నరు గదా కవితమ్మ మాటలు.. ఆ యాల్ల కేసీఆర్ సారు తెలంగాణ రాష్ట్రం సాధించే దాంక ఎత్తిన జెండా దించేది లేదు. ఒగవేల జెండా దించినా, రాష్ట్రం సాధించకుంట వేరే పార్టీలతోని లాలూచి పడ్డా నన్ను రాళ్లతోని కొట్టి సంపుర్రని పదే పదే జెప్పి జనాల్ల కేసీఆర్ మీద నమ్మకం పెరిగేతట్టు జేశిండుగదా. ఇగిప్పుడు తెలంగాణ రాష్ట్రం అనుకున్నంత అభివృద్ది కాలేదు కావట్టి నేను పార్టీ పెట్టిన, అన్ని వర్గాలకు న్యాయం జరిగేతట్టు సూస్తా.. ముఖ్యంగ పాంచజన్యం పేర్మీద జెప్పిన అంశాలను తల్లి లెక్క, తల్లి ప్రేమతోని కచ్చితంగ ఆచరించి చూపిస్తా అని చెప్పుడేగాదు., ఆ పనులు జెయ్యకుంటె అమరవీరుల స్థూపానికి నన్ను కట్టేశి రాళ్లతోని కొట్టుమని తెలంగాణ ప్రజలను కోరుతున్నా అని జెప్పిందియ్యాల్ల. అంటే ఆ యాల్ల కేసీఆర్ సారు తెలంగాణ ప్రజల్ల నమ్మకాన్ని పెంచుకునేతందుకు ఎసొంటి వ్యూహాలు పన్నిండో ఇప్పుడు కవితమ్మ గుడ గట్లనే జనాలను నమ్మిచ్చేతందుకు ఇసొంటి మాటలు మాట్లాడుతున్నట్టు అన్పిస్తున్నదని అంటున్నరు కవితమ్మ మాటలిన్న కొంత మంది తెలంగాణ మేధావులు. ఇగట్లనే ఇదే మీట్ ద ప్రెస్ ల మా రిపోర్టరన్న గీ ప్రశ్నేస్తే..

నా టార్గెట్ ఎవ్వలు గాదని కవితమ్మ జెప్తున్నది గనీ., ఆమె మాటలు, ఆమె జేస్తున్న పనులు సూస్తున్న శానా మంది మాత్రం బరాబర్ కవితమ్మ కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టేతందుకే పన్జేస్తున్నట్టున్నదని అంటున్నరు. సూడాలె మరి రావోయే రోజుల్ల కవితమ్మ స్ట్రాటజీ ఎట్లుంటది, తెలంగాణ ప్రజల కోసం ఎట్ల కొట్లాడుతది, తెలంగాణ రక్షణ సేన పార్టీని అధికారంలకు తీస్కరావడానికి ఏం జేస్తదనేది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story