Off The Record: కవిత టార్గెట్ ఎవరు..? కొత్త TRS పార్టీ వెనుక అసలు ప్లాన్ అదేనా?
Off The Record: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం! కవిత తన కొత్త పార్టీ 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS)ను ప్రారంభించారు.
Off The Record: కవిత టార్గెట్ ఎవరు..? కొత్త TRS పార్టీ వెనుక అసలు ప్లాన్ అదేనా?
Off The Record: తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇదో ముగిసిన అధ్యాయం. టీఆర్ఎస్ అంటే గత చరిత్ర. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయ అవనికపై.. మళ్లీ టీఆర్ఎస్ ఆవిర్భవించింది. తన కొత్త పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేనగా నామకరణం చేశారు కవిత. ఇది ఎవరూ ఊహించని పరిణామమే. పార్టీ పేరును చాలా కాన్ఫిడెన్షియల్‌గా ఉంచి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. నిన్నటి తెలంగాణ జాగృతి పార్టీ అని, ఇంకా ఏవేవో పేర్లు వినిపించాయి. కానీ ఫైనల్‌గా టీఆర్ఎస్ అని అనౌన్స్ చేశారు. ఐతే కవిత పార్టీ పేరు ఎంపిక విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ సమాజంతో.. పెనవేసుకున్న ఓ బంధం. ఉద్యమ సమయంలో జనాల్లో నోళ్లలో..బాగా నానిన పేరు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు టీఆర్ఎస్ అనే పేరు సుపరిచితమే. అందుకే ఆ సెంటిమెంట్‌ను క్యాచ్ చేసుకోవడానికే,, జనాల్లోకి సులువుగా వెళ్లేందుకే కవిత ఇలా వ్యవహరించి ఉంటారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చారు కేసీఆర్. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆకాంక్షతో పార్టీ పేరును ఛేంజ్ చేశారు. కాకతాలియంగా జరిగినప్పటికీ.. బీఆర్ఎస్‌గా మారాక.. గులాబీ పార్టీకి రాజకీయంగా పెద్దగా కలిసి రాలేదు. దీంతో ఆ పార్టీ కేడర్‌లో ..మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చాలనే డిమాండ్స్ వచ్చాయి. ఆఖరికి కేటీఆర్ కూడా.. టీఆర్ఎస్‌గా మార్చే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు. అంతలోనే కవిత.. తన పార్టీ పేరును టీఆర్ఎస్‌గా మార్చి.. గులాబీ దళానికి షాక్ ఇచ్చారు.
కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక జాగృతి సంస్థ పేరుతో ప్రజా బాట పట్టారు. జనంలోకి వెళ్లి వాళ్ల కష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రజా సమస్యలపై దీక్షలు, ఆందోళనలు సైతం నిర్వహించారు. అంతకు ముందు తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్‌కు ప్యార్లల్‌గా జాగృతి పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు కవిత. బతుకమ్మతో ప్రతి జిల్లాకు వెళ్లి.. ఉద్యమంలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచారు. జనాలను సాంస్కృతికంగా ఉమ్మడి వేదికపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. కానీ ఇప్పుడు సొంతంగా ఓ పార్టీని స్థాపించారు. ఇప్పుడామే ఓ పార్టీకి అధినేత్రి. ఐతే పొలిటికల్ పార్టీ నిర్వహణ అనేది.. అంత ఈజీ కాదనే విషయం అందరికి తెలిసిందే. అందులో ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాలి. గతంలో జాగృతిని నడిపిన అనుభవం ఉన్నప్పటికీ పార్టీని సమర్థవంతంగా నడిపించడంలో కవిత ఎలా ముందుకు వెళ్లారు. సవాళ్లను ఎలా అధిగమిస్తారు. ప్రత్యర్థుల వ్యూహాలను ఎలా తిప్పికొడతారు అనేది ఆసక్తిగా మారింది. పొలిటికల్ పార్టీకి.. ఇటు ప్రజా మద్దతు, కార్యదీక్షతో పనిచేసే కేడర్‌తో పాటు.. ఆర్ధిక వనరులు అవసరం. అలాగే ప్రజలు ఓన్ చేసుకోనేలా పార్టీ కార్యాచరణ ఉండాలి. దీనికి తోడు ప్రస్తుతం ఉన్న తెలంగాణలో ఉన్న రెండు జాతీయ, ఒక బలమైన ప్రాంతీయ పార్టీని తట్టుకుని.. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగగలుగుతారా..? వీటన్నింటిని దాటి.. రాజకీయ లక్ష్యాలను సాధిస్తారా అనేది..కవిత ముందున్న ప్రశ‌్నలు.
కొత్తగా పొలిటికల్ పార్టీని స్థాపించి సక్సెస్ అయినవారు.. ఫెల్యూర్‌ను మూటగట్టుకున్న వాల్లు దేశ రాజకీయ చరిత్రలో చాలా మందే ఉన్నారు. మరి కవిత వీరిలో ఎవరి సరసన చేరుతారు. ప్రజాధారణ పొంది.. తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా అవతరిస్తారా.. సీఎం కావాలన్న కవిత లక్ష్యం నేరవేరుతుందా అనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయాలను కవిత.. బాగానే అర్థం చేసుకుని ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. యువ తరాన్ని, మహిళలను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. తమ పార్టీని యువ రక్తంతో నింపుతామని, కొత్త రాజకీయాల్లోకి రావాలని అనుకునేవారికి అండగా ఉంటామని కవిత పదే పదే చెబుతున్నారు. అలాగే ఉద్యమకారులను కూడా కవిత తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారి కోసం ప్రత్యేకమైక
హామీలను గుప్పించారు. నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని.. ఉద్యోగ, ఉపాధి హామీలను ప్రస్తావించారు. సమాజిక తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు ప్రకటించారు. ఇక రాజకీయంగా.. ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ సర్కాప్‌పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు కవిత. గులాబీ పార్టీలో అసంతృప్తితో ఉన్న కేడర్, లీడర్‌ను గాలం వేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి కొత్త రాజకీయ పార్టీ అనౌన్స్‌తో.. కొత్త జర్నీని ప్రారంభించారు కవిత. మరి ఇందులో ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.
పార్టీ జెండాలో పేరు కింద అసోసియేషన్ అనే పదాన్ని చేర్చడం ప్రస్తుతం చర్చనీయం అవుతోంది. తెలంగాణ రాష్ట్ర సేన ’గా పేరు ఖరారు చేశారు. పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుతో కూడిన పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించారు. మధ్యలో తెలంగాణ మ్యాప్, దానిపై టీఆర్ఎస్ అనే అక్షరాలతో ఈ జెండాను రూపొందించారు. పార్టీ లోగోలో తెలంగాణ రాష్ట్ర సేన అంటూనే చివర్లో చిన్న అక్షరాల్లో ‘Association’ అనే పదాన్ని చేర్చడం ఆసక్తికరంగా మారింది. అయితే, పార్టీ పేరును గత TRSను పోలి ఉండేలా చూసుకుంటూనే.. న్యాయపరంగా ఇబ్బంది లేకుండా ఉండేందుకు అసోసియేషన్ అని చివర్లో చేర్చి ఉంటారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ జెండాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిబా ఫూలే, ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోలతో పాటు తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపాన్ని ఉంచారు. పార్టీ ఆవిర్భావ సభలో కవిత మాట్లాడుతూ.. పాంచజన్యం పేరుతో ఐదు హామీలను ప్రకటించారు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ఈ ఐదు ప్రధాన అంశాలపై ప్రత్యేకంగా కృషి చేస్తానని కవిత హామీ ఇచ్చారు. ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, వ్యవసాయం, సామాజిక న్యాయం లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని వాగ్దానం చేశారు. సింగిల్ నోటిఫికేషన్ ద్వారా 4 లక్షల ఉద్యోగాల భర్తీ, రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు స్వయం ఉపాధి రుణాలు, అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత తమ లక్ష్యమని చెప్పారు. ఈ రెండేళ్లు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని, తర్వాత వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం చేపడతామని కవిత జోస్యం చెప్పారు. తెలంగాణలో ‘మీ అమ్మ ప్రభుత్వం’ కచ్చితంగా వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.




