Jordar News: కాంగ్రెస్ కోసం బీఆర్ఎస్ నేతలతో రాములు తాత కయ్యం
Jordar News: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన మరియు రైతుల సమస్యలపై 'జోర్దార్ రాములు' వ్యాఖ్యలు.
Jordar News: కాంగ్రెస్ కోసం బీఆర్ఎస్ నేతలతో రాములు తాత కయ్యం
Jordar News: తంతే బోర్గే పల్గాలే బట్టెబాజి... ఏం చేత్తవ్రా నువ్వు... గుండు కొట్టిచ్చుకోంగనే ఉన్న మెదడు దొబ్బిందారా నీకు... తాడిచెట్టు లెక్క పెర్గినవ్ కని ఈతకాయంత బుర్రకూడ లేదుర నీకు... ఏం చేత్తవ్రా నువ్వు... పేగులు తీసి మెడలేసుకుంట కొడ్కా... లాగుల తొండలు సొర్రత్త కొడ్కా...
ఏ ముసలోడా మర్యాదగ మాట్లడు...
ఓ ముసలోడా ఎప్పుడు చూడు ఎవ్వలొ ఒక్కలతోని పంచాదేనా నీకు... ఇంతకు మీ పంచాది దేనిగురించొ చెప్పు...
అరే అదికాదు పిల్లా... మా ముక్యమంత్రి రేవంతాలు సారు పాత బంగులాలకు రంగులేసి నీనే కట్టిచ్చిన అని ఓపినింగులు చేత్తండని పచారం చేత్తండు వీడంటెనొ... అట్ల చెప్పుతే జనాలు నిజమే అనుకోరా...
అనుకునుడు ఏమున్నదే అదే నిజం కదా... ఎప్పుడో కట్టిన ఆరుట్ల సర్కారు బడికి బైట సున్నాలేసి, తెలంగాణ పబ్లిక్ స్కూలని పేరు మార్చి, మేమే కట్టినం అంటే ఏందన్నట్టే చెప్పు...
నువ్వుకూడా వీల్లదగ్గర ఏపాటొ పాకేజి తీసుకొనే ఇట్ల మాట్లాడుతున్నట్టున్నవ్ కని... సరే ఆ ముచ్చట అటుంచు... మా సర్కారు వచ్చినంక అబివ్రుద్ది చేసిన పార్కులను వనమవొత్సవం కార్యక్రమంల మా రేవంతాలు సారు ఓపినింగ్ చేత్తే అవ్వికూడా మీరు అబివ్రుద్ది చెయ్యలేదు అంటున్నడే అంటేనొ... ఎంత బల్పు వీనికి చెప్పు...
అది కూడా వందకు వందశాతం కరక్టేనే తాత... నిన్నటి ఆ వనమహోత్సవ కార్యక్రమంల చూపించిన వీడియోల ఉన్న మహబూబ్‌నగర్ మయూరి పార్కు, ఆర్మూర్ అర్బన్ పార్కు, శంషాబాద్ మస్జిద్ బండ పార్కు, కాళేశ్వరం ముక్తివనం పార్కు ఇవన్ని పోయిన సర్కారున్నప్పుడు కట్టిచ్చినయేనే...
అంటే ఇగ మా సర్కారు వచ్చినంక ఏం చెయ్యలేదంటవా... మా రేవంతాలు సారు ముక్యమంత్రి కుర్సిల కూసున్నంక అబివ్రుద్ది చెయ్యలేదంటవా...
అప్పులు తప్పా ఏం చేసిండు...
ఆగాగు ముసలోడా ఆ అన్న అన్నట్టు... కాంగ్రెస్ పార్టి అదికారంలకు వచ్చినంక అప్పులు తప్పా, అదికారంలకు వచ్చిన వందరోజుల్లనే చేత్తా అన్న ఆరు గ్యారంటీలను అమలు చేసిండా... ఏదన్న కొత్త ప్రాజెక్టు కట్టిచ్చిండా చెప్పు నువ్వె చెప్పు...
ఆడొల్లకు పిరి బస్సు పెట్టిండు... ప్రతి ఇంటికి రొండు వందల ఊనిట్ల ఉచ్చత కరంటు ఇత్తండు...
ఆ సంస్తలకు సర్కారు కోట్ల రూపాల అప్పు బకాయి పడి ఉన్నదాట... అవ్వి తీర్చని నాడు అసలు బాగోతం బైటపడ్తది...
వరి పంటకు ఐదువందల బోనస్ ఇత్తలేడానే... ఎంగిలిత్తారు మొకందానా...
యాసంగిల ఏసిన వరి పంటకు బోనస్ ఏది, పండించిన వడ్లను కొన్న తావేది,
సంట్రల్ సర్కారు కొంటలేదు, వాల్లు కొనంది మా రేవంతాలు సారు ఏం చేత్తడు చెప్పు...
అదే ముచ్చట అప్పటి కారుపార్టి సర్కారు అంటే... ప్రతిపక్షంల ఉన్న మీ రేవంతాలు సారు ఏమన్నడు ఒక్కసారి యాదికి తెచ్చుకొ పెద్దమన్సి...
కేంద్రం వడ్లు కొననంటే నువ్వు గాడ్ది పండ్లు తోమేటందుకున్నవా కేసియార్, లేకుంటే బోకరిజం చేసేటందుకున్నవా అన్నడు... అంటే ఈ లెక్కనా... అవ్వే మాటలు మా రేవంతాలు సారుకు... అబ్బా ఖర్మ ఎవ్వల్ని ఇడ్సిపెట్టది అంటే ఇదేనేమొ... సెండును ఎంత ఇస్పీడ్గా గోడకు కొడ్తమొ అదే ఇస్పీడుగా మాకు తల్గుతది అనుకోలేదురా అయ్యా,....
ఇప్పుడు అర్దమయ్యిందా పెద్దమన్సి... ఒక కాంగ్రెస్ పార్టి కార్యకర్తగా, ఒక రైతుగా మీ రేవంతాలు సారు అదికారంలకు వచ్చినంక రైతులకు ఎల్గ పెట్టింది ఏందొ నువ్వే చెప్పు...
రైతుబీమకు రాంరాం చెప్పిండు, ఎన్ని ఎకురాలున్న రైతులకైన యాల్లకు పడే రైతు బరోసాకు గుండుసున్న పెట్టిండు... వాటొపిల్లగానికి పైసలిచ్చిన ఇంటికాడ తెచ్చేసేతట్టు దొర్కిన యూరియబత్తాలకు లైన్లనిలపెట్టిండు, ఈలున్నప్పుడు పొయ్యి తెచ్చుకునేతట్టు దొర్కే ఇత్తునాలకు చెప్పులను లైన్ల పెట్టిచ్చిండు... కంటిరెప్పపాటుల కూడా పొని ఇర్వైనాలుగు గంటల ఎవుసం కరంటుకు కోత పెట్టిండు... ఇట్ల చెప్పుకుంట పోతే సాన్నే ఉన్నయె తల్లి...
మల్లా ఆ అన్నమీదికి పోతున్నవ్ మరి...
ఏం చెయ్యాల్నే మీదికి కాంగ్రెస్ పార్టి కార్యకర్తలమని గాంబీరంగ తిర్గుతున్నం కని... లోపట లోపట మాక్కూడా బాద ఉన్నదే కని ఏం చేత్తం... అదికారంల ఉన్నది మీమాయే అందుకే లోపటలోపట ఒత్తుకుంటున్నం...
పార్టంటే అబిమానం ఉండాల్నే ఎవ్వలు కాదంటలేరు... అట్లని మన అభిమాన నాయకుడు పాలన పేరుతోని మనకు సున్నం పెడ్తంటే ఊకుంటమానే అది చెప్పు...
అది కరస్టే కని ఏం చెయ్యిమంటున్నవ్ మరి... పేరుకేమొ అదికారంల ఉన్న పెద్దపార్టాయే... కని పెత్తనం చేసేకాడా మంది తిట్టే కాబట్టే... రైతులకు యాల్లకు రైతుబరోసా ఏసే గతిలేదాయే కోట్ల రూపాలు పెట్టి గాలిమోటర్లు కొనబట్టే, ఊల్లపొంటి రోడ్లు గతిలేవాయే... ఏతులకు ఏమేమొ పోగ్రాంలు పెట్టబట్టే... ఏం చెయ్యిమంటున్నవ్ చెప్పు...
సరే కనీ., ఇంతకు మొన్న పండిన యాసంగి వడ్లు అమ్మినవా మరి..
అమ్ముడెక్కడ్దే తల్లి... అవ్వి కల్లంలనే మొల్కెత్తుతానయ్... రొన్నెల్లకింద అమ్మిన మక్కజొన్నల పైసలు ఇంతవరకు పత్తకులెవ్వు... ఇగ ఇప్పుడేమొ సన్నవడ్లే ఎయ్యాలే, అవ్వి మీము చెప్పిన వడ్లే ఎయ్యాలే అని చెప్పబట్టే సర్కారు... అదికూడా కేంద్ర సర్కారు కొన్నన్ని వడ్లే మీము కొంటం అనబట్టే... ఇగ ఈ సాత చేసి దేనికి, మా తిప్పల దేనికి...
ముందు చూడవోతే నుయ్యి, ఎన్క చూడబోతే గొయ్యి అన్నట్టున్నదే మీ రైతుల పరిస్తితి...
ఆ గట్లనే ఉన్నది మా పరిస్తితి ఏం చెయ్యాలే మరి...
ఏ ముసలోడా మా పార్టొల్లు వత్తండ్లు నువ్వు ఈణ్నే ఉండు...
వాల్లచ్చి ఏం చేత్తరు, నువ్వచ్చి ఏం చేత్తవ్రా... వాల్లు నువ్వు ఈణ్నే ఉండుర్రి నీను కూడా మావొల్లను తీసుకొని వత్తా కొడ్కాడ...
మా ముసలోడు ఉన్న కాడ ఉండడమ్మా, దినాం ఇట్ల లేని పంచాదులు కొల్సుకుంటడు. అనవసరంగ తిట్లవడ్తడు. అయినా సర్కార్ తప్పులు జేస్తున్నా గుడ అంత మంచిగనే ఉన్నదని అంటే., అవస్థలు వడ్డోళ్లు తింటకుంటె ఊకుంటరా జెప్పుర్రి. యాల్లకు రైతుభరోసా ఏశి, పంటను యాల్లకు కొని ఆల్శం జెయ్యకుంట అకౌంట్ల పైసలెయ్యాలే. ఇత్తునాలు, ఎరువులకు కొరత లేకుంట సూస్కుని సరిపోను కరెంటు ఇచ్చిందంటే సాలు రైతులకు అంతకు మించి ఇంకేముంటది జెప్పుర్రి. రైతు ప్రభుత్వం అని మాటలు జెప్పుడు గాదు., రైతులకు పాయిదా అయ్యే పనులు జెయ్యాలే. ఏమంటరుల్లా పబ్లిక్కు.




