Off The Record: తొలి సారి ఎన్నికల బరిలో కవిత .. ప్రధాన పార్టీలకు పోటీ ఇవ్వగలదా..?
Off The Record: ఖైరతాబాద్ ఉపఎన్నిక రాజకీయం రంజుగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు కవిత సారథ్యంలోని తెలంగాణ రక్షణ సేన బరిలోకి దిగుతుండటంతో పోటీ రసవత్తరం
Off The Record: తొలి సారి ఎన్నికల బరిలో కవిత .. ప్రధాన పార్టీలకు పోటీ ఇవ్వగలదా..?
Off The Record: ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటుతో ఖైరతాబాద్ ఉప ఎన్నికకు కసరత్తు మొదలైంది. ఫలితంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ ఉప యుద్ధానికి కత్తులు నూరుతున్నాయి. అధికార కాంగ్రెస్‌కు ఈ ఉప ఎన్నిక కీలకం, ఎంతో ప్రతిష్టాత్మకం. అధికారంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్.. ఖైరతాబాద్‌లో తన రాజకీయ బలాన్ని చాటుకునే అవకాశం లేకపోలేదు.
బీఆర్ఎస్‌కు మాత్రం 2023లో తాను గెలిచిన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాల్సిన సవాల్. బీజేపీకి గత ఎన్నికల్లో సాధించిన ఓట్లను నిలబెట్టుకోవడం, రాజకీయ ఉనికిని బలోపేతం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఇలా ప్రధాన పార్టీలకు పోటీగా తెలంగాణ రక్షణ సేన కూడా బరిలోకి దిగుతోంది. టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.
కవిత కొత్త పార్టీ టీఆర్‌ఎస్‌కు ఇదే తొలి ఎన్నిక. దానం నాగేందర్ పార్టీ మారిన అంశం కూడా ఈ ఉప ఎన్నికలో ప్రధాన చర్చగా మారే అవకాశం ఉంది. బీఆర్ఎస్ తరఫున గెలిచి.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన దానం.. వ్యవహారాన్ని కవిత ఇప్పటికే ప్రస్తావిస్తున్నారు. దీంతో దానం పార్టీ ఫిరాయింపు అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రజల ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ లేకపోలేదు.
అయితే.. కవిత పార్టీకి ఖైరతాబాద్ ఉప ఎన్నిక సాధారణ ఎన్నిక కాదు. తెలంగాణ రక్షణ సేన ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే. అందుకే ఈ ఎన్నికలో వచ్చే ఓట్ల కంటే.. కొత్త పార్టీకి ఎంతమేరకు ప్రజల్లో రాజకీయ స్పందన వస్తుంది అన్నది కూడా కీలకం కానుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కవిత ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ విస్తరణపై దృష్టి పెట్టినట్లు చెబుతున్నారు. రాబోయే ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తామని, సామాజిక తెలంగాణ తమ పార్టీ లక్ష్యమని ఆమె చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కవిత కొత్త పార్టీకి ఖైరతాబాద్‌లో ఎంత బలం ఉంది..? ఆమె వ్యక్తిగత రాజకీయ గుర్తింపు కొత్త పార్టీకి ఎంతవరకు బదిలీ అవుతుంది..? ఏ సామాజిక వర్గాలు, ఏ ప్రాంతాలు, ఏ అంశాలపై పార్టీ ప్రచారం చేస్తుంది..? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఖైరతాబాద్ ఉపఎన్నిక రాజకీయం రంజుగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు కవిత సారథ్యంలోని తెలంగాణ రక్షణ సేన బరిలోకి దిగుతుండటంతో పోటీ రసవత్తరంఖైరతాబాద్ ఉప యుద్ధంలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు భిన్నంగా తెలంగాణ రక్షణ సేనకు లెక్కలు మరోలా ఉన్నాయట. కొత్త పార్టీగా తొలి ఎన్నికలోనే తమ రాజకీయ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడం.. కవిత నాయకత్వానికి ఓటర్ల స్పందనను తెలుసుకోవడం.. భవిష్యత్ రాజకీయ కార్యాచరణకు ఒక బేస్ ఏర్పాటు చేసుకోవడం.. ఇవే ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి..
మరి కవిత పార్టీ ఎలాంటి అభ్యర్థిని బరిలోకి దింపుతుంది..? ఏ అంశాల ప్రాతిపదికన ప్రచారం చేయనుంది..? ఖైరతాబాద్ ఓటర్లు కొత్త రాజకీయ పార్టీని ఏమేరకు ఆదరించనున్నారు..? మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.




