Off The Record: ఫ్యూచర్‌పై క్లారిటీ ఇచ్చిన కొండా దంపతులు!

Off The Record: మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు. ఢిల్లీకి వెళ్తున్న కొండా దంపతులు. కేబినెట్ హోదా పదవి దక్కనుందా?

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 16 Sept 2026 8:12 AM IST
Off The Record
X

Off The Record: ఫ్యూచర్‌పై క్లారిటీ ఇచ్చిన కొండా దంపతులు!

Off The Record: తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి పదవి నుంచి కొండా సురేఖను బర్తరఫ్ చేశారు. సురేఖ కూతురు సుస్మితా పటేల్ చేసిన ఘాటు వ్యాఖ్యలు తల్లి సురేఖ మంత్రి పదవికే ఎసరు పెట్టాయి. కొండా సురేఖను మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరినప్పటికీ ససేమిరా అనడంతో చివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమె బర్తరఫ్ చేశారు.

దీంతో కొండా ఫ్యామిలీ కొత్త పార్టీ పెట్టడం ఖాయమని, ఆమె బీజేపీలో చేరనున్నారని వార్తలు షికార్లు చేశాయి. ఈ క్రమంలో తాజాగా వరంగల్‌లో తన ముఖ్యమైన అనుచరులతో కీలక సమావేశం నిర్వహించారు. తాము పార్టీ మారేది లేదని, కాంగ్రెస్‌లోనే ఉంటామని, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేదాకా పోరాడుతామని కొండ దంపతులు చెప్పడం అందరినీ విస్మయానికి గురి చేసిందట.

పార్టీకి క్షమాపణలు చెప్పాలని, లేదంటే పేపర్ మీద రాసి ఇవ్వాలని సురేఖను బతిమాలాననీ కొండ మురళి చెప్పుకొచ్చారు. కానీ ఆత్మగౌరవం కోసం సురేఖ ఒప్పుకోలేదన్నారు. క్షమాపణ చెప్పి ఉంటే మంత్రి పదవి పోయేది కాదని మురళి వ్యాఖ్యానించారు. పదవులు ఇవాళ వస్తాయి, రేపు పోతాయని.. మాట మీద నిలబడటమే తమకు ముఖ్యమని మురళి తెలిపారు.

అయినప్పటికీ రాజకీయాల్లో తమకు తమ కూతురుకు సంబంధం లేదని కొండా మురళి అనడం కేడర్‌ను కన్ఫ్యూషన్‌లోకి నెట్టిందట. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరవాత జరిగిన పరిణామాలతో జగన్‌కు సపోర్ట్‌గా కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు.

ఇప్పుడు కూతురి కామెంట్స్‌కు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయ్యారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం మళ్ళీ మంత్రి అవుతాం, అసలు ఎందుకు మంత్రి పదవికి రాజీనామా చేయడం..? ఎందుకు బర్తరఫ్‌కు గురికావడం..? ఇదంతా నిశితంగా గమనిస్తున్న కొండా అనుచరుల్లో ఒకింత అయోమయం చోటు చేసుకుందట. అయితే పదవి అనేది అలంకారమే.. పదవి లేకున్నా పనులు చేయొచ్చంటూ వేదాంత ధోరణిలో మాట్లాడారు.

మంత్రి పదవి పోయిందని ఇంట్లో కూర్చోబోమని, నిత్యం ప్రజల్లోనే ఉంటామనీ కొండా దంపతులు స్పష్టం చేశారు. అంతేకాకుండా రాబోయే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలుస్తామని ధీమాగా చెప్పడంతో అందరూ విస్మయానికి లోనయ్యారట.

ఇలా ఉండగా.. సురేఖకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందట. వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించిందట. అంతకుముందు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా కొండా సురేఖకు ఫోన్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తోంది.

ఈ సందర్భంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై వారు చర్చించినట్టుగా సమాచారం. అంతేకాకుండా, పార్టీ అధిష్టానం అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇంతలో హస్తిన నుంచి పిలుపు రావడంతో కొండా అనుచరుల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ స్వయంగా కొండా సురేఖకు ఫోన్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై వారు చర్చించినట్టుగా సమాచారం.

ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని, పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని కొండా సురేఖకు మీనాక్షి సూచించారని తెలుస్తోంది. అంతేకాకుండా, పార్టీ అధిష్టానం అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్టుగా కూడా సమాచారం. ఈ నేపథ్యంలో కొండా సురేఖకు ప్రభుత్వంలో ఏదో ఒక పదవి ఇచ్చే అవకాశం ఉందని... కేబినెట్ హోదాతో పదవి దక్కనుందనే ప్రచారం తెరమీదకు వచ్చింది.

అయితే కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైన కొండా దంపతులు.. తమ ముఖ్య అనుచరులతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారట. ఇక, కొండా సురేఖకు కాంగ్రస్ అధిష్టానం నుంచి పిలుపురావడం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్