Konda Vishweshwar Reddy: కుటుంబ పాలనను ప్రశ్నిస్తే బయటికి గెంటేశారు: బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్
Konda Vishweshwar Reddy: కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం చేశారని, కుటుంబ పాలనను ప్రశ్నించిన వారిని టార్గెట్ చేశారని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి హెచ్‌ఎంటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Konda Vishweshwar Reddy: కుటుంబ పాలనను ప్రశ్నిస్తే బయటికి గెంటేశారు: బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్
Konda Vishweshwar Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని, కుటుంబ పాలనను ప్రశ్నించిన వారిని బయటికి గెంటేశారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు హెచ్‌ఎంటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
గులాబీ జెండా కేవలం ఒక్క కుటుంబానిది కాదని, తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడిన అందరిదీ అని ప్రశ్నించినందుకే ఈటల రాజేందర్‌ను పార్టీ నుంచి బయటికి పంపించారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి గుర్తుచేశారు.
తాను బీజేపీలో లేకపోయినప్పటికీ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నిలబడిన ఈటల రాజేందర్ గెలుపు కోసం తన సొంత టీమ్‌లతో విస్తృతంగా పనిచేశానని ఆయన స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రైతులను మోసం చేశారని, కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు.




