Jordar Varthalu: పెయ్యంతా కవర్ కప్పుకున్న ఎమ్మెల్యే.. దోమల నిరసనలో ఇది నెస్ట్ లెవల్ ర్యాగింగ్

Jordar Varthalu: హైదరాబాద్‌లో దోమల బెడదను నిరసిస్తూ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అసెంబ్లీ వేదికగా వినూత్న నిరసన చేపట్టారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 7:43 AM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: పెయ్యంతా కవర్ కప్పుకున్న ఎమ్మెల్యే.. దోమల నిరసనలో ఇది నెస్ట్ లెవల్ ర్యాగింగ్

Jordar Varthalu: భాగ్యనగరంలో దోమల బెడద రోజురోజుకూ మితిమీరిపోతోందని, దీనిపై ప్రభుత్వం స్పందించడం లేదని నిరసిస్తూ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన ఒళ్లంతా దోమల తెరలాంటి నెట్ డ్రెస్‌ను ధరించి ప్రత్యక్షమయ్యారు. నగరం యొక్క ప్రతిష్టను (City Image) కాపాడాలంటే దోమలను వెంటనే ఖతం పట్టించాలని, పబ్లిక్ తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు. సుధీర్ రెడ్డి ధరించిన ఈ కొత్త రకం 'దోమల మాస్క్ డ్రెస్' ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story