Jordar Varthalu: రక్షకుడు కాదు... భక్షకుడు
Jordar Varthalu: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఏఎస్ఐ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి.
Jordar Varthalu: రక్షకుడు కాదు... భక్షకుడు
Jordar Varthalu: నిజాయితీగల్ల పోలీస్లు ఆడొల్లను షిడాయించే బద్మాష్గాళ్ల ఈపులు సాపు జేస్తుంటరు. నిజాయితీగ పని జేశే పోలీస్లు ఏకాంతంగున్న జంటల పోట్వలు, వీడియోలు తీశి బ్లాక్ మేయిల్ జేశేటొల్ల తిక్క కుదురుస్తుంటరు. నిజాయితీ గల్ల పోలీస్లు బెదిరిచ్చి పైసలు వసూలు జేశే రౌడీలకు హడల్ పుట్టిస్తుంటరు. కని, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పర్ధిల పన్జేస్తున్న గీ ఏఎస్ఐ సారు పోలీస్ వృత్తికే కళంకంగ మారి, ఆ వృత్తికే మచ్చ తెచ్చిండుల్ల. అగో అర్థ నగ్నంగ కూసోని, తాగిన మత్తుల ఎట్ల జోగుతున్నడు సూడుర్రి.
పోలీసే దొంగైతే అన్నట్టు.. బాధ్యతగల్ల ఏఎస్ఐ కొలువు జేసుకుంట నేరస్తుడు చేశే అన్ని పనులు జేస్తున్నడు. ఒక్కటని గాదు మల్ల.. ఏకాంతంగున్న జంటలను వీడియోలు,పోట్వలు తీంచుతున్నడట.. తీశిన వీడియోలు, పోట్వలను సూపెట్టి ఆడొల్లను షిడాయించ సూస్తున్నడట.. బెదిరిచ్చి పైసల్ వసూలు గుడ జేస్తున్నడట. ఈ లత్కోరు పని కోసమని ఓ ఆటోడ్రైవర్ను పురమాయించిండంటె, వీడు ఎంత గలీజ్ గాడో సూడుర్రిగ.. ఆటో డ్రైవరు ఎవ్వడో గానీ, వాడు ఏకాంతంగ కూసున్న జంటల పోట్వలు తీసుడు.. తీశిన పోట్వలు, వీడియోలతోటి ఏఎస్ఐ సారు నీచ్ కమీనే పనులు జేసుడు. గిదే పని సారుది. ఆడొల్లను షిడాయించడు.. మొగొల్ల కాన్నేమో పైసల్ గుంజుడు. ఏకాంతంగ జంటలు కనవడుడు పాపమట.ఇద్వరకట్ల ఇసోంటి దారుణాలు శానా జేశిర్రట. అంతేగాదుల్ల.. ఈ దారి తప్పిన పోలీస్ డ్యూటీ జేస్తున్న పోలీస్ స్టేషండ్లనే ఇంకో ఎస్సై సారు గుడ అచ్చం ఇదే బాపతట. ఈల్ల పాడు పనుల గురించి సోషల్ మీడియా కోడై కూస్తున్నది. గిదే ముచ్చట జిల్లా ఎస్పీదాంక పోతే.. సమాచారం అందింది.. విచారణ జర్పి చర్యలు తీస్కుంటమని జెప్పిండు సారు.. సూడాలె మరి.. భక్షక భటుడుగ మారిన ఈ రక్షక భుటునికి ఎట్ల బుద్ది శెప్తరో ఇగ పోలీస్ పెద్ద సార్లు.




