Jordar Varthalu: హెల్మెట్ పెట్టుకుని పనిచేస్తున్న రైతులు.. ఎండకు తట్టుకోలేక ఈ ఉపాయం
Jordar Varthalu: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సింగారం గ్రామంలో రైతులు ఎండ తీవ్రత నుంచి తట్టుకోవడానికి హెల్మెట్లు ధరించి పొలం పనులు చేస్తున్నారు.
Jordar Varthalu: హెల్మెట్ పెట్టుకుని పనిచేస్తున్న రైతులు.. ఎండకు తట్టుకోలేక ఈ ఉపాయం
Jordar Varthalu: వారెవ్వా.. ఈల్ల ఇకమత్, మామూలుగ లేదు గదా. అస్సల్కే ఎండలు ఓ రేంజిల దంచుతున్నయ్. సూరన్న కింద నిలవడ్తె సుర్కులంటిత్తున్నడు. ఎండపట్టుకు పొయ్నప్పుడు టోపో, తువ్వాలనో పెట్టుకున్నా ఫాయిదా ఉండదని ఇచ్చంత్రాల ఇకమత్ జేశిర్రు మైబాద్ జిల్లా బయ్యారం మండలం సింగారం ఊరి కాడి రైతన్నలు.
బండ్ల మీన్నుంచి పడ్తె దెబ్బలు తాకకుంటనే కాపాడే హెల్మెటు, ఎండ దగడ్ కెంచి కాపాడదా అని గీ హెల్మెట్ ఉపాయం జేశిర్రట. ఇగ ఎల్మెట్ పెట్టుకొని ఎర్రటి ఎండల సుతం సూరన్న సుర్కులకు భయపడకుంట నిమ్మలంగ మక్కలు ఎండపోత్తున్నరు రైతన్నలు. అటు దిక్కు అందరు గిదే ఉపాయం జేస్తున్నరట ఎండ దెబ్బ తల్గకుంట.
పెద్ద రోడ్ల మీద బండ్లోల్లు పెట్కోంగనో.. పెద్ద లీడర్లు ప్రశారాల కోసమో.. సుక్క తెగిపడ్డట్టు కానొచ్చే ఎల్మెట్లు, కల్లాలల్ల రైతన్నల తల్కాయలకు కానొచ్చెటాలకు ఇచ్చంత్రంగ సూడవట్టిర్రు ఇంకొందరు అటు దిక్కు జనాలు. ఏమాటకామాటనే కని, ఉన్నదాంట్ల కొత్తయి కనిపెట్టుట్ల రైతన్న తర్వాతనే ఎవ్వలైనా. ఈ ఎండాకాలంల ఒక్కొక్కలు ఒక్కోతీరు ఉపాయాలు భలేగ జేస్తుంటరు సూరన్న వెట్టే బాధ నుంచి బైటవడేతందుకు. మరిగ పబ్లిక్కు.. ఎండలు ఇంకా మండుతయని వాతావరణ శాఖోళ్లు అంటున్నరు గావట్టి., మీరు సుతం ఎండదెబ్బ తల్గకుంట జర్ర గట్టి జాగ్రత్తలు తీస్కోండ్రి. సరేనా..




