Burning Topic: భారత్ కు తప్పిన మరో భారీ ఉగ్ర దాడి ముప్పు

Burning Topic: లక్నోలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ, సచివాలయాలే లక్ష్యంగా బాంబు దాడులకు ప్లాన్. ఏఐ టెక్నాలజీ, యూట్యూబ్ సాయంతో బాంబుల తయారీ - షాకింగ్ వివరాలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 May 2026 7:01 AM IST
Burning Topic
X

Burning Topic: భారత్ కు తప్పిన మరో భారీ ఉగ్ర దాడి ముప్పు

Burning Topic: గతేడాది జరిగిన ఢిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ - ఎన్‌ఐఏ కొనసాగిస్తున్న దర్యాప్తులో మరో భయాయనక ఉగ్రకుట్ర బయటకు వచ్చింది. నిందితులు ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో లోని కీలక ప్రదేశాల్లో వరుస దాడులు జరిపేందుకు ప్రణాళికలు తయాలు చేశారని బయట పడింది. ఎర్రకోట పేలుడు నిందితులైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్​, డాక్టర్ షాహీన్​సయూద్ ఆగస్టు 25 నుంచి 30 మధ్య హర్యానా ఫరీదాబాద్ నుంచి లక్నోకు వెళ్లి రెక్కీ నిర్వహించారు. కీలక భవనాలు, ప్రముఖుల నివాసాలు, జనావాసాల్లో దాడులు నిర్వహించేందుకు పరిశీలించారని ఎన్‌ఐఏ వర్గాలు తెలిపాయి. ఇందులో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ, రాష్ట్ర సచివాలయంతో పాటు జనాల సందడి అధికంగా ఉండే ఇమాంబరా, లాల్​బాగ్​, అమీనాబాద్​ ప్రాంతాల్లో రెక్కీ చేపట్టారు. ఈ ప్రాంతాలలో పేలుడు పదార్థాలతో నింపిన కారును పేల్చాలని ఉగ్రవాదులు భారీ స్కెచ్ తయారు చేసినట్లు విచారణలో బయట పడింది.

ఎన్‌ఐఏ నిర్వహించిన దర్యాప్తులో ఇంకా అనేక విషయాలు బయటపడ్డాయి. రెక్కీ నిర్వహించడానికి లక్నోకు వచ్చిన డాక్టర్ ముజమ్మిల్ షకీల్​, డాక్టర్ షాహీన్​సయూద్ లాల్‌బాగ్‌లోని ఖండారీ బజారులో ఉన్న తమ బంధులు ఇంట్లో బస చేశారు. ముజమ్మిల్​తన మొబైల్‌లో ట్రైఅసిటోన్​ ట్రైపెరాక్సైడ్ - టీఏటీపీ తయారీకి అవసరమైన రెండు రసాయనాలు దొరికే షాపుల కోసం వెలికాడు. టీఏటీపీని 'మదర్ ఆఫ్ సైతాన్​' అని పిలుస్తారు. ఇది చాలా ప్రమాదకరమైనది. లక్నో నగరం మీద పూర్తి అవగాహన ఉన్న స్థానికున్ని సంప్రదించి ఈ రసాయణాలు భారీ పరిమాణంలో దొరుకుతాయో లేదో కనుక్కోవాలని కోరారు. ముజమ్మిల్ తాను నేరుగా వెళ్లి అడిగితే అనుమానం వస్తుందని స్థానికుడిని పంపినట్లు తెలుస్తోంది. ముజమ్మిల్ ఆదేశాల మేరకు షాహీన్​ఆ రసాయన దుకాణాల పేర్లను తన సొంత చేతిరాతతో ఒక కాగితంపై రాసుకొని ఫొటో తీసుకుంది. ఎన్‌ఐఏ దీన్ని ఆమె ఫోన్ నుంచి స్వాధీనం చేసుకుంది.

ఉగ్రవాదులు 2025 నవంబర్​ 10వ తేదీన ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడులో కూడా ఇదే రసాయనాన్ని ఉపయోగించారు. ఈ బాంబులను ఫరీదాబాద్‌లోని ఒక అద్దె ఇంట్లో రహస్యంగా ఉంటూ బాంబులు తయారు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా బాంబులను తయారు చేసేందుకు లక్నో శివారులోని జన సందడి లేని ప్రాంతాన్ని వెతికారు. ఈ విషయాలన్నీ కూడా ఎన్ఐఏ దర్యాప్తులో బయటకు వచ్చాయి. ఎన్‌ఐఏ అధికారులు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన వివరాలను సేకరించి, తమకు దొరికిన ఆధారాలతో సాంకేతిక విశ్లేషణ చేశారు. ఉగ్రవాదులకు నిధులు అందే మార్గాలను కనుక్కునే ప్రయత్నంలో లక్నోలో తలపెట్టిన ఉగ్రవాదుల కుట్ర కూడా వెలుగు చూసింది. ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో మే 14న 7,500 పేజీల ఛార్జ్​షీట్​ను కోర్టులో దాఖలు చేశారు ఎన్‌ఐఏ అధికారులు. ఇందులో ఈ వివరాన్నీ పొందు పరిచారు.

అల్-​ఖైదా ఇన్​ది ఇండియన్ సబ్​కాంటినెంట్​- ఏక్యూఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న అన్సార్ గజ్వాతుల్ హింద్​సంస్థ లక్నోను తమ రహస్య స్థావరంగా మార్చుకోవాలని చూసిందని జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తులో బయటపడింది. తప్పింది. ఈ ఉగ్రముఠాలో డాక్టర్లు ఉండడంతో వీరిని వైట్​కాలర్ టెర్రరిస్టులు అని పిలుస్తున్నారు. ఈ డాక్లర్లంతా ఏక్యూఐఎస్​, అన్సార్​గజ్వాతుల్ హింద్​తీవ్రవాద సంస్థల భావజాలానికి ఆకర్షితులయ్యారు. ఎర్రకోట పేలుడుకు వాడిన బాంబును అదే సాంతికతతో మళ్లీ తయారు లక్నోలో వరుస పేలుళ్లకు పాల్పడటమే వీరి అసలు లక్ష్యమని ఎన్‌ఐఏ దర్యాప్తులో బయటపడింది. అయితే సకాలంలో వీరి ఈ కుట్ర బయటపడటంతో మరో భారీ ఉగ్రవాడి ముప్పు తప్పిపోయింది. ఫరీదాబాద్‌లోని అల్ ఫలా యూనివర్సిటీ కేంద్రంగా జరిగిన ఈ కుట్రలో పలువురు అనుమానితులను అరెస్టు చేయడం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఎర్రకోట కారు బాంబు పేలుగు కోసం ఉగ్రవాదులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెక్స్ ఉపయోగించారని ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జసీర్ బిలాల్ వనీ ఐఈడీ బాంబుల తయారీలో కీలకంగా వ్యవహరించాడు. కారును నడిపి ఆత్మాహుతి చేసుకున్న డాక్టర్‌ ఉమర్‌ ఉన్‌ నబీకి జసీర్‌ను పరిచయం చేసిన వ్యక్తి డాక్టర్‌ అదీల్‌ అహ్మద్‌ రాథెర్‌ అని, బాంబులకు కావాల్సిన పొటాషియం నైట్రేట్‌ వంటివి అతడే సమకూర్చాడని గుర్తించారు. రాకెట్ల తయారీలో ఏయే పదార్థాలు ఎంతెంత వాడాలి అనేది యూట్యూబ్, చాట్‌ జీపీటీల్లో వెతికిన ఆధారాలు అధికారులకు లభ్యమయ్యాయి. మార్కెట్‌లో లభించే సాధారణ వస్తువలతో పేలుడు పదార్థాలను రూపొందించినట్టు గుర్తించారు. కుట్రకు కావాల్సిన సాంకేతిక సాయాన్ని అందించడానికి నిందితుడు జసీర్‌ బిలాల్‌ వనీ 2024-25లో రెండు మూడు సార్లు ఫరీదాబాద్‌లోని అల్‌ఫలా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో బస చేసినట్లు ఎన్‌ఐఏ దాఖలు చేసిన ఛార్జిషీటు తెలిపింది.

రాకెట్‌తో ప్రయోగించగల బాంబులను ఎర్రకోట పేలుడు కేసులు నిందితులు ముందుగానే పరిశీలించారు. వాటిని కచ్చితత్వంతో తయారుచేసి, జమ్మూ కశ్మీర్‌ అనంత్‌నాగ్‌ జిల్లాలోని కాజీగుండ్‌ అడవుల్లో పరీక్షించారని దర్యాప్తులో తేలింది. దీనికోసం నిందితుల్లో ఒకడు ఇంజినీరు మాదిరిగా పని చేశాడని అధికారులు గుర్తించారు. . ఇందుకు సంబంధించి అధారాలను కూడా సేకరించారు. ఆన్‌లైన్ ట్యూటోరియల్స్, ఏఐ ఆధారంగా అతడు ఈ నైపుణ్యాలను సాధించాడని చెప్పారు. బాంబులకు కావాల్సిన పరికరాలను ఆన్‌లైన్‌ సంస్థల ద్వారా తెప్పించుకున్నారు. సాధారణంగా తక్కువ ధరలకు అందుబాటులో ఉండే వస్తువులతోనే నిందితులు ఇంతటి ప్రమాదకర పేలుడు పదార్థాలను రూపొందించారని చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఏఐ, ఇతర ఓపెన్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు ఉగ్రవాదుల చేతుల్లో దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఎంతగా ఉందో ఈ కేసు రుజువు చేస్తోందని కూడా అధికారులు అభిప్రాయపడ్డారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story