Burning Topic: బీజేపీకి ఊహకందని దీదీ అస్త్రాలు.. నాలుగోసారి అధికారం దక్కేనా?
Burning Topic: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ మరియు బీజేపీ మధ్య పోరు రసవత్తరంగా మారింది.
Burning Topic: బీజేపీకి ఊహకందని దీదీ అస్త్రాలు.. నాలుగోసారి అధికారం దక్కేనా?
Burning Topic: బెంగాల్‌లో వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టేందుకు భారీ పోరాటమే చేస్తున్నారు మమతా బెనర్జీ. గతంలో ఎన్నడూ లేని విధంగా దీదీని గట్టి సవాలే విసురుతోంది బీజేపీ. టీఎంసీని గద్దె దింపడమే లక్ష్యంగా గట్టి వ్యూహమే పన్నుతున్నారు కమలనాథులు.
అయినప్పటికీ విజయం తమదేనని ధీమాతో ఉన్నారు దీదీ. బీజేపీకి బయటి పార్టీగా చిత్రీకరించేందుకు బెంగాలీ అస్థిత్వ నినాదాన్ని ప్రయోగించారు. ఎన్నికల సంఘాన్ని అడ్డు పెట్టుకొని బీజేపీ బెంగాల్ మీద కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు మమత. మరోవైపు సామాజిక సమీకరణాలే లక్ష్యంగా ఆకర్శనీయమైన పథకాలను ప్రకటించి ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో అత్యంత కీలకం పశ్చిమ బెంగాల్. ఈ రాష్ట్ర అసెంబ్లీలోని 294 సీట్లకు రెండు విడతలుగా ఈ నెల 23, 29 తేదీల్లో పోలింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ పేరు వినగానే గుర్తుకు వచ్చేది మమతా బెనర్జీయే అంటే అతిశయోక్తేమీ లేదు. ఈ రాష్ట్రానికి గత 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు మమత.
ఇప్పటి దాకా జరిగిన ఎన్నికలు ఒక ఎత్తలయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ఆమె రాజకీయ జీవితానికి అత్యంత సవాలుగా నిలిచాయి. గత ఎన్నికల్లో ఏకంగా 77 స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదా పొందిన బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. బెంగాల్‌లో వేళ్లూనుకుపోయిన తృణమూల్ కాంగ్రెస్‌ను పెకిలించాలని కంకణం కట్టుకున్నారు కమల నాథులు. అయితే మమతా బెనర్జీ మాత్రం తమ పార్టీ 226 సీట్లలో విజయం ఖాయమని మమత ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ప్రభుత్వం కూడా తమదేనని స్పష్టం చేశారు దీదీ.




