Jordar News: వీడెవడండీ బాబు .. ఏకంగా కోతికే కటింగ్ చేస్తున్నాడు
Jordar News: కర్ణాటకలో వింత ఘటన! బార్బర్ షాపుకు వచ్చి మరీ కటింగ్ చేయించుకున్న కోతి.
Jordar News: వీడెవడండీ బాబు .. ఏకంగా కోతికే కటింగ్ చేస్తున్నాడు
Jordar News: అబ్బా నెత్తిల దువ్వెన పెట్టి, కత్తిరతోటి జట్టు కత్తిరిస్తుంటె ఎంత సమ్మగున్నదుల్ల.. ఎంతైనా సుఖమంటె ఈ మానవులదే. మా కోతుల జాతి నుంచే అచ్చి తీరు తీరు విద్యలు నేర్సుకోని శానా సుఖపడ్తార్రు. పేండ్లు సూసుడు బంజేంచి, మా వర్గంల గుడ కొన్ని కోతులకు జట్టు కత్తిరిచ్చుడు నేర్పియ్యాలె. ఓ అన్న కటింగుకు రొండు వందలట గదా.. జర మంచిగ కత్తిరయ్యే నీ బాంచన్. ఉల్టా పల్టా గిట్ల చేత్తివా.. మా మైళా కోతుల ముంగట ఇజ్జత్ వోతది. ఈ నడ్మ యూత్ పొల్లగాండ్లు పక్కలు శిన్నగ జేంచి నడ్మిట్ల ఉంచుకుంటార్రు గదా.. అదేం కటింగే అది. అగో అట్ల కత్తిరియ్యి.,. స్టైలిష్ కోతి అని పిలిపిచ్చుకుంట అందరితోటి. ఏంది అబ్బాస్ కటింగు చేత్తవా.. అది ఓల్డు ఫ్యాషన్ అట గాదే. ఏంది పవన్ కల్యాళ్ హేయిర్ స్టైల్ చేత్తవా.. పవర్ స్టారంటే నాకు సుతం ఇష్టమే గని, పక్కలు కొర్గి, నడ్మిట్లుంచుకునుడేనట గదా ఇప్పట్ల ఫ్యాషన్.. నాగ్గూడ అట్లనే శెయ్యి. అగో అసల్ కటింగు చేత్తన్నవానే అన్న.. బుత్తవాంతనన్న కింద రాల్తలేదు గదా. సరే హాయిగ అపినిస్తున్నది నిద్రన్న పోతిగ.. లేశినంక అద్దంల సూస్కుంట నా అందం ఎట్లున్నదో. కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లాలనటుల్ల గిది. మన మనుషులను సూశి ఇస్టైల్గుండాల్నని డిసైడైందో ఏమో గని గీ కోతి బార్బర్ దేవరాజు అన్నకాడికి వొయ్యి జోర్దార్ కటింగు చేంచుకున్నది. అట్లిప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ల ఇర్గమర్గ తిర్గుతాంటె, ఈ గమ్మతిని సూశినొల్లంత కొద్ది నవ్వుకుంటలేరు.




