Jordar Varthalu: ఈ కాక నిరసన నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్

Jordar Varthalu: ఉత్తరప్రదేశ్‌లోని బస్తి జిల్లాలో వినూత్న నిరసన.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 April 2026 9:47 AM IST
Jordar Varthalu
X

Jordar Varthalu: ఈ కాక నిరసన నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్

Jordar Varthalu: వామ్మో.. ఆర్జీవీ సిన్మాల ఆత్మ లెక్కనే ఉందని గుబులుపడేరుల్లో. ఈనె ఆత్మ గాదు, మన్షేనుల్లా. బతికుండంగనే రికార్డులల్ల సంపేశ్న ఆపీసర్లను తువ్వాలల్ల శెప్పువెట్టి కొట్టినంత పన్జేశిండు ఉత్తర్ ప్రదేశ్ కాడుండే గీ కాక. అటు దిక్కు బస్తీ జిల్లాల ఉంటడు. ఈయ్న పేరు ఇషాక్ అలీ. సర్కార్ దావఖాన్ల అటెండర్ కొల్వు జేశి దిగిపోయిండట. ఈనెకు తాతముత్తాతల కెంచి అచ్చిన రెండెకరాల జాగుండెనట. ఈ జాగ మీద, దొంగల కన్నువడ్డదట. భూమిని ఎత్కపొయ్యే ఛాన్సు లేదు కావట్టి, రికార్డులల్ల కెంచి మాయం జేశిర్రట. ఈయ్న బతికుండంగనే, సచ్చిపోయిండని జెప్పి డెత్ సఫ్టికెట్ పుట్టిచ్చి భూమిని ఒగామె పేర్మీదికి ఎక్కిచ్చిర్రట. ఇగీ ముచ్చట కాకకు ఆల్శంగ తెల్శింది. 2019ల కొల్వుకు రికామిచ్చి, రిటైర్మెంట్ తీస్కునుడ్తోనే.. రికాం ఉండకుంట సర్కారోల్ల భరతంపట్టే పనిముంగటేసుకున్నడు.

అప్పటికెంచి ఇప్పటిదాంక దగ్గర్దగ్గర ఏడేండ్లు శెప్పులు అర్గెదాంక తిర్గినా పట్టిచ్చుకుంటలేరట. తిర్గితిర్గి బొక్కలు సుతం అర్గినయట కని, బత్కుండంగనే ఎట్ల సంపేశిర్రన్న ముచ్చట బైటికి జెప్తలేరట. తప్పుజేశ్నమని.. ఈనె పేరు మీదికి భూమిని ఎక్కిత్తలేరట. ఇగిట్లైతే భూమి దక్కదని, నేను శవాన్ని కాదు మన్షినే అని సూపెట్టే కార్యాన్ని బస్తీ జిల్లా కలెక్టరేట్ల ముంగటేసుకున్నడు. ఆఫీస్ ముంగట అడ్డంగ పండుకొని, శవాలమీదేశే తెల్లటి పేగును పర్సుకున్నడు. శవం మీదేశే పూలదండను ఏసుకున్నడు. నేను బతికున్న సార్లూ అని పేపర్ల రాశి, అచ్చిపొయ్యెటోల్లకు కనవడెతట్టు పట్టుకున్నడు. ఇది అసలు సార్లు సూశిర్రో లేకుంటే.. మనల్ని కాదు తియ్ అని పట్టిచ్చుకోకుంట ఎల్లిపోయిర్రో తెల్వదు కని, కాక నిరసననైతే నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ పోర్రి. నిరసనల శరిత్రల ఇసొంటియ్ ఇప్పటి దాంక సూశుండం. సూడబోం గూడ. ఇగ అసుంట అచ్చిన రిపోర్టరన్నలు వీడియో తీశి.. టీవీలల్ల ఇడుస్తె, కాక ఓప్కెకు శభాష్ అనుకుంట తారీఫ్ జేస్తున్నరు. శవాలను తెచ్చి జంగు జేశ్నోల్లను సూశ్నం, పెద్ద లీడర్లకు పాడె కట్టి నిరసన జేశ్నోల్లను సుతం సూశ్నం కని, ఇట్ల శవం గెటప్ల గోడెల్లవోసుకున్నోల్లను ఇప్పటిదాంక సూల్లేదని పర్శాన్ కావట్టిర్రు దేశం జనాలు. ఈ దెబ్బతోనన్న కాక తిప్పలు తీర్తయో లేకుంటె.. ఎప్పటిలెక్కనే, అప్పుడున్నోల్లను అడుక్కోర్రని లైట్ తీస్కుంటరో సూడాలె మరి.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story